Rain Alert: మండే ఎండల్లో ప్రజలకు గుడ్ న్యూస్.. ఐదు రోజుల పాటు వర్షాలే.. వర్షాలు..
ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. రోహిణి కార్తెలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.
ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. రోహిణి కార్తెలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు.. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా.. హైదరాబాద్ లో ఉదయాన్నే చిరుజల్లులు కురిసాయి. అయితే, వర్షాలు కురిసినా పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 40°C నుండి 43°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని.. పేర్కొంది. హైదరాబాద్ నగరంలో 38°C నుండి 41°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..