- Telugu News Photo Gallery Summer Vacation: Best Tourist Places in India to spend memorable time with family and Friends
Summer Vacation: వేసవిలో గుర్తుండిపోయే ఫ్యామిలీ టూర్.. మైమరపించే ప్రకృతి అందాలు.. కావాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
మండుతున్న వేడిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. వేసవి ఎండల మధ్య కూడా చల్లని వాతావరణంలో అందమైన దృశ్యాలను ఆస్వాదించాలని, కుటుంబంతో గురుతుండిపోయే క్షణాలను గడపాలని కోరుకుంటుంటారు. అలాంటి ట్రిప్ అనుభూతిని అందించే కొన్ని ప్రదేశాల వివరాలు మీ కోసం..
Updated on: May 28, 2023 | 9:18 AM

మండుతున్న వేడిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. వేసవి ఎండల మధ్య కూడా చల్లని వాతావరణంలో అందమైన దృశ్యాలను ఆస్వాదించాలని, కుటుంబంతో గురుతుండిపోయే క్షణాలను గడపాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలో మీకు కూడా అలాంటి ప్లాన్స్ ఉంటే.. మీరు ఈ ప్రాంతాలకు వెళ్లండి. మీ ట్రిప్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

ఊటీ: ఉత్కంఠభరితమైన నీలగిరి కొండల మధ్య ఉన్న ఊటీ.. ఓ అద్భుతమైన హిల్ స్టేషన్. ఊటీలోని పచ్చని లోయలు, తేయాకు తోటల అందాలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మీరు నాణ్యమైన సమయాన్ని ప్రశాంతంగా గడపగలుగుతారు. మీ భాగస్వామితో వెళ్లేందుకు ఇది ఉత్తమ ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు.

లేహ్ లడఖ్: లడఖ్‌లోకి లేహ్‌కు కూడా మీరు సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళవచ్చు. అక్కడి ఉత్కంఠభరితమైన దృశ్యాలు, మఠాలు, పర్వతాల అందాల మధ్య నడిచే సరదా వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరు లేహ్‌లో రివర్ రాఫ్టింగ్, బైకింగ్ వంటి సరదా కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు.

సిక్కిం: సిక్కిం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువ కాదు. ఇక్కడ మీరు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక అనుభవాలను పొందగలుగుతారు. ఇంకా మీరు ఇక్కడ మోమోస్,తుక్పా వంటి స్థానిక ఆహారాలను ఎంతో రుచిగా ఆస్వాదించవచ్చు. హిమాలయ పర్వత శ్రేణులలో ఒదిగి ఉన్న సిక్కిం మీ సమ్మర్ టూర్‌ని గుర్తుండిపోయేలా చేయగలదు.

డల్హౌసీ: వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం మీరు హిమాచల్ ప్రదేశ్‌లోకి డల్హౌసీకి కూడా వెళ్ళవచ్చు. అక్కడి సహజ సౌందర్యం, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు చాలా ఇష్టంగా ఉంటుంది. వేసవిలో పర్యాటకులు ఎక్కువగా తిరుగుతంటే ప్రాంతాలలో డల్హౌసీ కూడా ఒకటి. ముఖ్యంగా డల్హౌసీలో ఉండే పచ్చని లోయల దృశ్యాలు, పర్వత శ్రేణుల మధ్య రోడ్లలో ప్రయాణాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోలేరు.




