Watch Video: ఓరి భగవంతుడా..! పెంపుడు కుక్కల కోసం పుచ్చకాయలతో ఉయ్యాల.. ఐడియా అయితే కిర్రాక్ ఉందిగా..

సోషల్ మీడియా అనేది నిజంగా ఓ వింత ప్రపంచం. ఎక్కడా కనీవినీ ఎరుగని విషయాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట..

Watch Video: ఓరి భగవంతుడా..! పెంపుడు కుక్కల కోసం పుచ్చకాయలతో ఉయ్యాల.. ఐడియా అయితే కిర్రాక్ ఉందిగా..
Pet Dogs On Swing
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 28, 2023 | 8:18 AM

Watch Video: సోషల్ మీడియా అనేది నిజంగా ఓ వింత ప్రపంచం. ఎక్కడా కనీవినీ ఎరుగని విషయాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పెట్ లవర్ తన పెట్స్‌ని ఎలా ఆడించాడో చూస్తే ఆశ్చర్యపోవాలిసిందే.. సాధారణంగా ఏ పెట్ లవర్ అయినా తమ పెట్స్‌ని సరదాగా ఎత్తుకోవడం, బయటకు తీసుకెళ్లి ఆడించడం, వాటికి ఇష్టమైనవి తినిపించడం, ఇవ్వడం వంటివి చేస్తారు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం అలా జరగలేదు.

సదరు పెట్ లవర్ తను పెంచుకునే రెండు పెంపుడు కుక్కలను ఉయ్యాలలో వేసి ఊపాడు. అది కూడా మామూలు ఉయ్యాల అనుకుంటే పొరపాటే.. అవి పడిపోకుండా భారీ సైజులో ఉన్న రెండు ఖాళీ పుచ్చకాయలను సేకరించి, వాటిల్లో రెండు కుక్కల కింద కాళ్లు దూరేలా రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత పుచ్చకాయలను చెట్టు కొమ్మకు వేలాడదీసి.. తన పెంపుడు కుక్కలను వాటిల్లో కూర్చొబెట్టాడు. అంతే అవి కూడా ఎంతో సంతోషంగా ఉయ్యాలను ఎంజాయ్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ANiMAL (@__angelic_animals)

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్క సారిగా షాక్. ముందెన్నడూ చూడని దృశ్యం కళ్లెదురుగా ఉంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా.. అయితే వీడియో కామెంట్ సెక్షన్ ఎనేబుల్‌లో లేకపోవడంతో తమ అభిప్రాయాలను తెలియజేయలేకపోయారు. మరోవైపు ఈ వీడియోకు 45 వేలకు పైగా లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..