Watch Video: అట్లపెనంపై ముగ్గుల దోశ.. నిమ్మకాయ పెట్టి చేతబడి ముగ్గు వేయమంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో మీ కోసం..

Watch Video: చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాగే తమ విన్యాసాలకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇందులో కొన్ని వైరల్ అవుతుంటే..

Watch Video: అట్లపెనంపై ముగ్గుల దోశ.. నిమ్మకాయ పెట్టి చేతబడి ముగ్గు వేయమంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో మీ కోసం..
Rangavalli On Dosa Tawa
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 28, 2023 | 8:50 AM

Watch Video: చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాగే తమ విన్యాసాలకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇందులో కొన్ని వైరల్ అవుతుంటే.. మరి కొన్ని తుస్సుమంటున్నాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ చేసిన ప్రయత్నం బాగానే ఫలించింది. నేలపై వేయాల్సిన ముగ్గును అట్ల పెనంపై వేసి నెటిజన్ల ఆదరణను పొందగలిగారు. అయితే వీడియోలోని ఆమె చేయి తప్ప ముఖం కనిపంచలేదు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెటిజన్లను కళ్లు తిప్పుకోనివ్వడంలేదు. అలాగే వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఆ వీడియోలో ఓ నెటిజన్ అట్లు వేసే పిండితో అట్ల పెనంపై చుక్కలు పెట్టడం.. అ తర్వాత వాటిని ముగ్గుగా చేయడాన్ని మీరు చూడవచ్చు. అలాగే ముగ్గు వేయడం పూర్తయ్యాక దానిపై నూనె వేసి, దాన్ని తినడానికి తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి ముగ్గుల దోశ అని పేరు పెట్టారు నెటిజన్లు. ఇంకా కొందరు కలర్స్ వేయడం మర్చిపోయారని, గొబ్బెమ్మ కూడా పెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే ‘ఇది ముగ్గుల దోశ కాదు.. చేతబడి చేసుందుకు వేసిన దోశ.. ఇంకా నిమ్మకాయలు పెట్టడం ఆలస్యమయింది అంతే’ అంటూ రాసుకొస్తున్నారు. మరోవైపు మే 27న షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 60 వేల లైకులు, 30 లక్షలకు పైగా వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..