Watch Video: ‘అమ్మ ప్రేమ అంటే అంతే..!’ బిడ్డను నోటితో పట్టుకుని తీసుకెళ్తున్న తల్లి పిల్లి.. కారణం ఏమిటంటే..?

ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాయి. నమ్మలేేకపోతే మీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను..

Watch Video: ‘అమ్మ ప్రేమ అంటే అంతే..!’ బిడ్డను నోటితో పట్టుకుని తీసుకెళ్తున్న తల్లి పిల్లి.. కారణం ఏమిటంటే..?
Mother Cat With Its Kitty
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 12:47 PM

ప్రతి తల్లి కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మాతృత్వం విషయంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉంటాయి. నమ్మలేేకపోతే మీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడాల్సిందే. ఎందుకంటే సాధారణంగా చిన్న పిల్లలు ఇంటి బయటకు వెళ్లి అడుతుంటే.. తల్లులు కంగారు పడిపోవడమేకాక వెంటనే తమ చిన్నారులను ఎత్తుకుని ఇంట్లోకి తెచ్చేస్తుంటారు. అచ్చం అలాగే చేసింది ఓ పిల్లి. అందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న పిల్లి వీడియోలో.. ఓ తల్లి పిల్లి తన బిడ్డను ‘వీధిలో ఆడుకుంది చాలు.. ఇక ఇంటికి పదా’ అన్నట్లుగా ఎక్కడ నుంచో నోటితో పట్టుకుని తీసుకురావడం కనిపిస్తుంది. అది తన బిడ్డను ఎక్కడ నుంచి తీసుకువస్తుందో తెలియదు కానీ చిన్ని పిల్లి రక్షణ కోసమే ఆ తల్లి ఆరాటం అని మాత్రం అర్థమవుతోంది. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meowed by 9GAG (@meowed)

చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మియావ్ మమ్మి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుందని.. పిల్లలు ఎంత పెద్దయినా తల్లిదండ్రులకు చిన్నవాళ్లేనని.. ఇంట్లోకి రమ్మని అమ్మ పిలిస్తే వెంటనే వెళ్లాలి, వెళ్లకపోతే ఇంతే సంగతి.. అంటూ రాసుకొస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల లైకులు, 21 లక్షలకుపైగా వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..