IPL 2023 Final: ఫైనల్ చివర్లో గుజరాత్ కొంపముంచిన నెహ్రా-హార్దిక్..! ‘అంతగా సలహాలు అవసరమా’ అంటున్న అభిమానులు..

IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేజేతులా పోగొట్టుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడింది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌..

IPL 2023 Final: ఫైనల్ చివర్లో గుజరాత్ కొంపముంచిన నెహ్రా-హార్దిక్..! ‘అంతగా సలహాలు అవసరమా’ అంటున్న అభిమానులు..
Fans On Ashish Nehra's Advices in IPL 2023 Final
Follow us

|

Updated on: May 31, 2023 | 9:57 AM

IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేజేతులా పోగొట్టుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడింది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌ 5వ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ ఆద్యంతం గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం చెలాయించినా.. చివరి రెండు బంతుల్లో తడబడి ట్రోఫీని చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచింది. అయితే చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కనబర్చిన అత్యుత్సాహమే ఆ జట్టు కొంపముంచిందంటూ నెటిజన్లు, ఆ టీమ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తమదైన కోచింగ్‌, కెప్టెన్సీ‌తో జట్టుకు విజయాలు అందించి, అరంగేట్ర సీజన్‌లోనే టీమ్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టిన నెహ్రా-పాండ్యా.. చివరి మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమయ్యారని అంటున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌ ఆద్యంతం తనదైన జోరును కొనసాగించిన నెహ్రా.. ఫుట్‌బాల్ కోచ్ మాదిరి బౌండరీ లైన్ వద్ద నిలబడి పదే పదే ఆటగాళ్లతో మాట్లాడుతూ కీలక సలహాలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నెహ్రా కోచింగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించినా.. అతను పట్టించుకోలేదు. విభిన్నరీతి కోచింగ్‌తో 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలబెట్టడమే కాకుండా.. క్వాలిఫయర్-1లో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో గెలిపించి ఫైనల్ చేరేలా చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ నెహ్రా తన మార్క్ కోచింగ్‌ను చూపించాడు. ఇదే తరహాలో కెప్టెన్‌గా హార్దిక్ రాణించాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఫైనల్ మ్యాచ్‌ చివరి దశలో నెహ్రా అత్యుత్సాహం ప్రదర్శించాడు. మోహిత్ శర్మ వేస్తున్న చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన సమయంలో కూడా చెన్నై తరఫున బిగ్ షాట్స్ ఆడేందుకు జడేజా తడబడుతున్నాడు. అలా తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చిన మోహిత్ శర్మ మంచి మూమెంటమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే ఆశిష్ నెహ్రా కోచ్‌గా హద్దు దాటి మరీ కలగజేసుకున్నాడు. అదే సమయంలో నెహ్రాతో కెప్టెన్ హార్దిక్ కూడా కలిసి మోహిత్ శర్మకు వరుసగా అనవసర సలహాలు ఇచ్చి, అతన్ని ఒత్తిడిలో పెట్టాడు. మోహిత్ వేయాల్సిన చివరి ఓవర్ ఐదో బంతికి ముందు వాటర్ బాయ్‌తో అతనికి ప్రత్యేక సందేశం పంపి, బౌలింగ్ ప్రణాళికలో మార్పు చేయాలని సూచించేలా మాట్లాడాడు నెహ్రా.

చివరి రెండు బంతులు వేసేందుకు మోహిత్ టైమ్ తీసుకోవడంతో జడేజా ఊపిరి తీసుకున్నాడు. ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్చగా భారీ షాట్లు ఆడగలిగాడు. నాలుగు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ.. నెహ్రా అనవసర సూచనలతో పాటు హార్దిక్ పాండ్యా చిట్ చాట్‌తో మరింత ఒత్తిడికి గురయ్యాడు. చెన్నై విజయానికి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో.. మోహిత్ యార్కర్ వేసే ప్రయత్నంలో ఐదో బంతి స్లాట్‌లో పడగా జడేజా లాంగాన్ దిశగా అవసరమైన సమయంలో సిక్సర్ బాదాడు. దీంతో మరింత ఒత్తిడికి గురైన మోహిత్ శర్మ.. చివరి బంతిని లైన్ మిస్సై లెగ్ స్టంప్ దిశగా లో ఫుల్ టాస్ వేయగా.. జడేజా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ రాబట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ని విజయ తీరాలకు చేర్చాడు. మోహిత్ శర్మకు ఎలాంటి సూచనలు చేయకుండా అలానే వదిలేస్తే అతను కట్టుదిట్టంగా వేసేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ.. కోచ్ నెహ్రాపై ఇంకా కెప్టెన్ హార్దిక్‌పై మండిపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్