- Telugu News Photo Gallery Cricket photos Matthew Hayden Picks Best XI Of IPL 2023, No Place For Kohli, Rohit Sharma
IPL 2023 Best XI: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ఇదే.. కోహ్లీ, రోహిత్‌కి నో చాన్స్.. ప్రకటించిన ఒకప్పటి ధోని సహచరుడు..
IPL 2023 Best XI: ఐపీఎల్ టోర్నీ ముగిసిపోవడంతో క్రికెట్ దిగ్గజాలు తమ తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ వివరాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధోని సేనలో భాగమైన ఓ దిగ్గజ క్రికెటర్ కూడా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు.
Updated on: Jun 01, 2023 | 12:14 PM

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఫలితంగా ఐపీఎల్ క్రికెట్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ని సీఎస్‌కే జట్టు సమం చేసింది.

ఇక టోర్నీ ముగిసి పోవడంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లతో తన జట్టును ప్రకటించాడు.

మాథ్యూ హేడెన్ ప్రకటించిన ఈ టీమ్‌లో ఆర్‌సీబీ నుంచి ఒక ఆటగాడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇంకా ముంబై ఇండియన్స్ నుంచి ఇద్దరు ఉన్నారు.

అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఐదుగురు, సీఎస్‌కే జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. అసలు మాథ్యూ హేడెన్ ప్రకటించిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం...

మాథ్యూ హేడెన్ ప్రకటించిన జట్టు: శుభమాన్ గిల్ (GT), రుతురాజ్ గైక్వాడ్ (CSK), ఫాఫ్ డుప్లెసిస్ (RCB), సూర్యకుమార్ యాదవ్ (MI), కామెరాన్ గ్రీన్ (MI), రవీంద్ర జడేజా (CSK), MS ధోని (CSK), రషీద్ ఖాన్ (GT), నూర్ అహ్మద్ (GT), మహమ్మద్ షమీ (GT), మోహిత్ శర్మ (GT)





























