Telangana Formation Day: తెలంగాణలో జూన్ 2 పొలిటికల్ హీట్.. ఆవిర్భావ దినోత్సవంపై ఒక్కో పార్టీ ఒక్కోలా..!
జూన్ సెకండ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన రోజు, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి రేపటికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయ్. నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని పదో ఏట అడుగుపెడుతోన్నవేళ తెలంగాణలో సరికొత్త రాజకీయం హీట్ పుట్టిస్తోంది.
జూన్ సెకండ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన రోజు, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి రేపటికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయ్. నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని పదో ఏట అడుగుపెడుతోన్నవేళ తెలంగాణలో సరికొత్త రాజకీయం హీట్ పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్ ఫైట్ జరుగుతోంది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ లబ్ధి కోసం పోటీ పడుతున్నాయ్ ప్రధాన పార్టీలు.
ఒకవైపు అధికార పార్టీ BRS, మరోవైపు BJP, ఇంకోవైపు కాంగ్రెస్. ఈ మూడు పార్టీలూ పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయ పడుతున్నాయ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని వాడుకుంటున్నాయ్. తెలంగాణ తెచ్చింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తామే అంటోన్న BRS… 21రోజులపాటు దశాబ్ది వేడుకలు జరుపుతోంది. అసలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ అంటోన్న ఆ పార్టీ లీడర్లు.. స్టేట్ వైడ్‌గా జాతీయ జెండాలు ఎగురవేసేందుకు రెడీ అవుతోంది. బీజేపీ కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. గోల్కొండ వేదికగా రెండ్రోజులపాటు వేడుకలు నిర్వహించబోతోంది కేంద్ర సాంస్కృతికశాఖ.
దశాబ్దంలో శతాబ్దికి సరిపడ అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది అధికార BRS. ఇన్నాళ్లూ ఒక్క హైదరాబాద్‌లోనే వేడుకలు జరిగితే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. 21రోజులపాటు స్టేట్‌వైడ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది BRS పార్టీ.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీ కూడా రాష్ట్రమంతటా వేడుకలకు ప్లాన్ చేసింది. అసలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే బీజేపీ చొరవ వల్ల అని చెబుతోంది. సుష్మాస్వరాజ్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తలదన్నేలా గ్రాండ్‌గా ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించేందుకు రంగంలోకి దిగింది కేంద్ర సాంస్కృతికశాఖ. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి. ఖిలా ఔర్ కహానీ పేరుతో కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. బోయిన్‌పల్లి ఐడియాలజీ సెంటర్‌లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో.. ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఇదే విషయాన్ని ఉత్సవాల వేదికగా ప్రజలకు వివరించాలని చూస్తోంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ఆహ్వానం సైతం పంపించారు.
నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్ ప్రధాన పార్టీలు. పొలిటికల్ మైలేజ్ కోసం పోటాపోటీగా వేడుకలు నిర్వహిస్తున్నాయ్. మరి, ఈ ఫైట్‌లో పైచేయి ఎవరిది.. అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..