AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సూపర్ స్టార్‌ మహేష్..! ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో 'గుంటూరు కారం' మువీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌ సరసన పూజాహెగ్డే, శ్రీలీల ఆడిపాడనున్నారు. తాజాగా విడుదలైన ఈ మువీ మాస్‌ స్ట్రైక్‌ వీడియో సోషల్‌ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ మువీలో మహేష్‌ ఊర మాస్‌ లుక్‌ క్రేజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పనులు..

Mahesh Babu: సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సూపర్ స్టార్‌ మహేష్..! ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Mahesh Babu
Srilakshmi C
|

Updated on: Jun 01, 2023 | 10:05 AM

Share

టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. తాజాగా మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ మువీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌ సరసన పూజాహెగ్డే, శ్రీలీల ఆడిపాడనున్నారు. తాజాగా విడుదలైన ఈ మువీ మాస్‌ స్ట్రైక్‌ వీడియో సోషల్‌ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ మువీలో మహేష్‌ ఊర మాస్‌ లుక్‌ క్రేజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

త్రివిక్రమ్ మువీ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌ మరో క్రెజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు టాక్‌. రాజమౌళి ఏ హీరోతోనైనా సినిమా తీస్తున్నప్పుడు మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు. అందుకు కారణం లేకపోలేదు.. తన సినిమాలో నటించే హీరో లుక్ నుంచి డేట్స్‌ వరకు ఏదీ.. లీక్ కావడం జక్కన్నకు ఇష్టం ఉండకపోవడమే కారణం. ఇక మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తీయనున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే జక్కన్న తను తర్వాత తీయబోయే రెండు సినిమాల్లో ఒకటి మహేష్‌తో తీయనున్నట్లు స్పష్టం చేశారు.

‘గుంటూరు కారం’ విడుదలైన తర్వాత మహేష్ జక్కన్న కాంబోలో కొత్త ప్రాజెక్ట్‌ మూవీ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇక రాజమౌళి సినిమాలంటే ఎలాగూ ఆలస్యం అవుతుంటాయి. ఈ సినిమా పూర్తయ్యేంత వరకు మహేష్ వేరే సినిమా చెయ్యడని తెలుస్తోంది. పైగా జక్కన్న సినిమా కోసం తన లుక్‌ను కూడా మహేష్‌ మార్చుకోనున్నారు. అందుకు కొంత కసరత్తు కూడా అవసరం. ఈ మువీ పూర్తయ్యే నాటికి కనీసం రెండు, మూడేళ్లయినా పడుతుందని.. అప్పటి వరకు మహేష్‌ ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో టాక్. ఇక ఇప్పటికే మహేష్ జక్కన్న కాంబో మూవీపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో ఖచ్చితంగా ఆడుతుందని ఫ్యాన్స్‌ ముందు నుంచే సంబరాలు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!