30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు..! జెంటిల్మెన్ సీక్వెల్‌కు కీరవాణి సంగీత బాణీలు
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా 1993లో విడుదలై జెంటిల్మెన్ మువీ అప్పట్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో లెజెండరీ దర్శకుడు శంకర్ సినీ రంగంలోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే ఘన విజయం అందుకున్నారు. వరుసగా 175 రోజుల పాటు థియేటర్లు హౌస్ ఫుల్ మార్క్ కొట్టేసిన ఏకైక సినిమా ఇది. ఇక ఎఆర్ రెహ్మాన్ స్వరపరచిన..
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా 1993లో విడుదలై జెంటిల్మెన్ మువీ అప్పట్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో లెజెండరీ దర్శకుడు శంకర్ సినీ రంగంలోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే ఘన విజయం అందుకున్నారు. వరుసగా 175 రోజుల పాటు ఏకబిగిన థియేటర్లు హౌస్ ఫుల్ మార్క్ కొట్టేసిన ఏకైక సినిమా ఇది. ఇక ఎఆర్ రెహ్మాన్ స్వరపరచిన పాటలు 90వ దశకంలో కుర్రకారును ఉర్రూతలూగించాయి. అప్పట్లోనే ఏకంగా 3 లక్షల పాటల క్యాసెట్‌లు అమ్ముడయ్యాయి. ఇక అ మువీ విడుదలైన 30 ఏళ్ల తర్వాత, సీక్వెల్‌గా జెంటిల్మెన్ 2 చిత్రాన్ని నిర్మించడానికి కేటీ కుంజుమోన్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఎ గోకుల్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జెంటిల్‌మన్ 2 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్ 2 చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చనున్నారు.
తాజా దర్శకుడు గోకుల్‌కృష్ణ హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించగా, కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించారట కూడా. ఆ తర్వాత నిర్మాత కేటీ కుంజుమోన్‌కు ఫోన్ చేసి జులై నుంచి మ్యూజిక్ కంపోజ్ పనులు ప్రారంభిద్దామని తెలిపినట్లు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కుంజుమోన్ తొలినాళ్లలో మలయాళంలో సినిమాలు నిర్మించినప్పటికీ, ఆ తర్వాత తమిళ చిత్రాసీమలో అడుగుపెట్టాడు. కధలన్ (1994), కాదల్ దేశం (1996), రచ్చగన్ (1997)లతో వరుస హిట్ సినిమాలు నిర్మించారు.
View this post on Instagram
మెగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించనున్నారు. ఈ మువీలో తమిళ, తెలుగు నటుడు చేతన్ శీను హీరోగా నటించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.