AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anu Emmanuel: తమిళ్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న అను.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్

చూడచక్కని రూపం. విశాలమైన కళ్ళ తో ఆకట్టుకుంది అను. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు.

Anu Emmanuel: తమిళ్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న అను.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్
Anu Emmanuel
Rajeev Rayala
|

Updated on: Jun 04, 2023 | 9:26 AM

Share

మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. చూడచక్కని రూపం. విశాలమైన కళ్ళ తో ఆకట్టుకుంది అను. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ ఈ అమ్మడి ఖాతాలో పడలేదు.

అయితే ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అనుకున్న రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయిన అను. తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఈ అమ్మడు అక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది. కార్తీ సరసన జపాన్ లో అను హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో అమ్మడి అందం, నటన అక్కడి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ్ లో మరో సినిమా చేసే ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అదికూడా కార్తీ సినిమాలోనే అని టాక్. 96 ఫేం ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అయ్యితే అను తమిళ్ లో బిజీకావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Follow Us
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..