TSPSC Group 1 Hall Tickets: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 హాల్‌టికెట్లు విడుదల.. మరో వారం రోజుల్లో పరీక్ష
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గతంలో ఈ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జారీ చేసినహాల్‌టికెట్లు..
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గతంలో ఈ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జారీ చేసినహాల్‌టికెట్లు చెల్లవని, తాజాగా జారీ చేసిన కొత్త హాల్‌టికెట్లు తప్పనిసరిగా ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. వచ్చే ఆదివారం (జూన్ 11న) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆఫ్‌లైన్ విధానంలో (పెన్ను, పేపర్ విధానం) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ గ్రూప్-1 కింద 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత గతేడాది అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఐతే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేశారు. జూన్ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. తొలుత గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తుదకు ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.