Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి.. 141 మంది ఆచూకీ గల్లంతు

దేశ వ్యాప్తంగా దిగ్ర్భంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి (60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి.. 141 మంది ఆచూకీ గల్లంతు
Odisha Train Accident
Follow us

|

Updated on: Jun 04, 2023 | 11:59 AM

శ్రీకాకుళం: దేశ వ్యాప్తంగా దిగ్ర్భంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి (60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్‌ రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, ప్రధాని మోదీ మరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుమూర్తి మృతి చెందారు. ఏపీకి చెందిన మరో 11 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 9 మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. మరో ఇద్దరిని భువనేశ్వర్‌లోని అపోలోకు తరలించారు. గుర్తు తెలియని మరో 30 మంది ఫొటోలు అధికారులకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

కాగా ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రెండింటిలోనూ ఏపీకి చెందిన 571 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 141 మంది ప్రయాణికుల వివరాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. గల్లంతైన ప్రయాణికుల జాడ కోసం విశాఖపట్నం కలెక్టరేట్‌లో 9154405292 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 300లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..