‘సారూ​.. నాకు పెళ్లి కూతురుని చూడండి..’ పెళ్లి కోసం 45 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వానికి దరఖాస్తు!

తాను పెళ్లాడేందుకు ఓ వధువును చూడాలని 45 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ సహాయ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..

'సారూ​.. నాకు పెళ్లి కూతురుని చూడండి..' పెళ్లి కోసం 45 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వానికి దరఖాస్తు!
Kailash Mahawar
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 8:00 PM

తాను పెళ్లాడేందుకు ఓ వధువును చూడాలని 45 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ సహాయ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వం స్థానికంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో జూన్ 3న దౌసా జిల్లాలోని సికంద్రా ప్రాంతంలో గంగద్వాడి గ్రామం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఐతే ఆ గ్రామానికి చెందిన కైలాష్ మహావర్ అలియాస్ కల్లు మహావర్ (45) అనే వ్యక్తికి ఇప్పటి వరకు పెళ్లికాలేదు. అతనికి ఓ అక్క, ముగ్గురు సోదరులు ఉన్నారు. ప్రస్తుతం కైలాష్‌ అతని తమ్ముడి వద్ద ఉంటూ షాపుల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తోబుట్టువులందరికీ పెళ్లిళ్లు కాగా తనకు మాత్రం పెళ్లి కాకపోవడంతో ఏకంగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనుకు పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు అందించాడు. అందులో తనకు ఎలాంటి భార్య కావాలో కూడా వివరించాడు.

తనకు కాబోయే భార్య సన్నగా మెరుపు తీగలా ఉండాలని, వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని, ఇంటి పనిలో తగిన నైపుణ్యం కూడా ఉండాలని పేర్కొన్నాడు. కైలాష్ మహావర్ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన తహసీల్దార్ అతనికి పెళ్లి జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం కైలాష్ మహావర్ అర్జీని గ్రామ కార్యదర్శికి సిఫార్సు చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ ఆదేశించారు. ఇక భార్య కోసం కైలాష్ మహావర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునున్న విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది. దీంతో అతని ఇంటికి పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..