Telangana: వెనుకబడిన వర్గాలవారికి రూ. లక్ష ఆర్థిక సాయం.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలివే..
Telangana: తెలంగాణలోని వెనుకబడిన వర్గాలవారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత నెల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కులవృత్తులు, చేతివృత్తుల పైనే జీవడం సాగిస్తున్నవారికి ఆర్థిక సాయం అందిచాలని సీఎం కేసీఆర్ సర్కార్..
Telangana: తెలంగాణలోని వెనుకబడిన వర్గాలవారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత నెల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కులవృత్తులు, చేతివృత్తుల పైనే జీవడం సాగిస్తున్నవారికి ఆర్థిక సాయం అందిచాలని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణియించింది. ఈ మేరకు జూన్ 9న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తులను నమ్ముకున్నవారికి సీఏం కేసీఆర్ రూ.లక్ష వరకు అర్థిక సహాకారం చేయనున్నారు. ఇందు కోసం చేయవలసిన ఏర్పాట్లను పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా వృత్తులవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ప్రక్రియ మొదలైంది. అలాగే లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు కోసం ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా ముఖ్యమైన వివరాలతో అప్లికేషన్‌ను రూపొందించారు.
కాగా, ఈ వెబ్‌సైట్ ద్వారా తక్షణమే అప్లే చేసుకోనేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. కులవృత్తులు, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. కాగా, జూన్ 9న సీఎం కేసీఆర్ ఆయా వృత్తులవారికి ఆర్ధిక సహాయాన్ని లాంఛనంగా అందజేసిన తర్వాత.. ఆ వెంటనే అన్ని నియోజకవర్గాల్లోని లబ్దిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు రూ. లక్ష పంపిణీ చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..