CM KCR: సీఎం కేసీఆర్‌కు కర్బలా తల్వార్లను బహూకరించిన హోంమంత్రి మహమూద్ అలీ..
Mahmood Ali presents Talwars To CM KCR: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఇటీవల ఇరాక్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహమూద్ అలీ ఇరాక్ నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోసం అరుదైన బహుమతిని తీసుకువచ్చి.. ఆయనకు అందజేశారు.
Mahmood Ali presents Talwars To CM KCR: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఇటీవల ఇరాక్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహమూద్ అలీ ఇరాక్ నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోసం అరుదైన బహుమతిని తీసుకువచ్చి.. ఆయనకు అందజేశారు. ఇరాక్ దేశంలోని కర్బలా నుంచి విజయానికి గుర్తుగా తీసుకువచ్చిన తల్వార్లను హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ.. సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. ప్రగతి భవన్‌లో సోమవారం నాడు సీఎం కె. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ప్రత్యేకంగా కలిసిన మహమూద్ అలీ ఆయనకు అందజేశారు. అయితే, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇరాక్‌లో పర్యటించిన మహమూద్ అలీ.. అక్కడి భారత ప్రతినిధులతో సైతం భేటీ అయ్యారు. తెలంగాణ మరియురిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ మధ్య దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరాక్‌లోని భారత రాయబారి ప్రశాంత్ పీస్‌తో చర్చించారు.
దీంతోపాటు ఇరాక్‌లోని నజాఫ్, కర్బలాలోని ఇమామ్ అలీ (ర), ఇమామ్ హుస్సేన్ పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. హజ్రత్ అలీ మజార్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..