AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 – KAB Education Summit 2023: భవిష్యత్తుపై సందేహాలున్నాయా..? హైదరాబాద్‌లో మెగా ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌..

TV9-KAB Education Summit 2023 : మీ పిల్లల విద్యా, ఉద్యోగ అవకాశాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. సూచనలు కూడా ఫ్రీ.. త్వరలోనే హైదరాబాద్ వేదికగా టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరగనుంది.

TV9 - KAB Education Summit 2023: భవిష్యత్తుపై సందేహాలున్నాయా..? హైదరాబాద్‌లో మెగా ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌..
TV9 - KAB Education Summit 2023
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2023 | 7:46 PM

Share

TV9-KAB Education Summit 2023 : మీ పిల్లల విద్యా, ఉద్యోగ అవకాశాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. సూచనలు కూడా ఫ్రీ.. త్వరలోనే హైదరాబాద్ వేదికగా టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరగనుంది. ఇంటర్మీడియట్ (+2), డిగ్రీ విద్యార్థుల కోసం తదుపరి విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలపై TV9 – KAB Education Consultancy సంయుక్తంగా అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్ ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లోని నిజం కాలేజి గ్రౌండ్స్‌ వేదికగా June 9, 10, 11వ తేదీలలో ఎడ్యుకేషన్ సమ్మిట్ జరగనుంది. గతవారం విజయవాడ, విశాఖపట్నం వేదికగా Education Summit 2023 జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ కు వేలాది మంది విద్యార్థులు హాజరై.. సలహాలు, సూచనలను పొందారు.

ఉన్నత చదువులు, ఉత్తమమైన కెరీర్ ఎంచుకోవడానికి నిపుణులతో సలహాలు, సూచనలు ఇవ్వనన్నారు. Inter(+2) లేదా Degree తర్వాత కెరీర్‌ ఎలా నిర్మించుకోవాలనే విషయంపై మీమంస ఉన్న విద్యార్థులకు TV9 – KAB Education Summit ఒక సువర్ణఅవకాశంగా దోహదపడనుంది. ఎన్నో ప్రఖ్యాత కళాశాలలు, యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొనే ఈ Education Summitలో విద్యార్థులు అన్ని విషయాల గురించి సమగ్రంగా తెలుసుకోవచ్చు.

Tv9 Kab Education Summit

Tv9 Kab Education Summit

ఇంటర్‌ తర్వాత.. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, కంప్యూటర్‌ యానిమేషన్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, పలు కోర్సులు.. ఇలా ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రకాల గైడెన్స్ ఇవ్వనున్నారు. దీంతోపాటు ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAMCET, EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సెలింగ్ లలో ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్స్‌ సలహాలు, సూచనలు కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సదస్సులో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు పాల్గొని సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. విద్యారంగ పరిస్థితులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వస్తుంది?.. ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్‌ సమాధానం ఇస్తారు. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ గా ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..