Hyderabad: స్వీట్లను ఇష్టంగా కొంటున్నారా.? జర జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి..
మార్కెట్‌లోని దుకాణదారులు కల్తీ మావాను ఉపయోగించి మిఠాయిలు తయారు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు, దీనివల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది.
మార్కెట్‌లోని దుకాణదారులు కల్తీ మావాను ఉపయోగించి మిఠాయిలు తయారు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు, దీనివల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. ఖోయా, నెయ్యి, నూనె, పాలు, కృత్రిమ రుచి, రంగును స్వీట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. స్వీట్లలో వీటన్నింటి పరిమాణాన్ని పెంచడానికి, వాటిలో సుద్ద, యూరియా, సబ్బు, వైట్నర్ వంటి కృత్రిమ పదార్థాలను కలపడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇలా ఎక్కడైనా కూడా కల్తీ రాజ్యమేలుతోంది. తాజాగా హైదరాబాద్‌లో కల్తీ స్వీట్లను తయారు చేసే దందా గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు
నకిలీ మకిలీ.. తినే స్వీట్లకు కూడా పాకింది. హైదరాబాద్ లాల్‌దర్వాజ ఏరియాలో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సెఫ్టీ అధికారుల మెరుపు దాడులతో నకిలీ స్వీట్ల దందా బయటపడింది. మిల్క్ పౌడర్‌తో పాటు కెమికల్స్ కలిపి కలకంద, అజ్మీరి కలకంద, ఖోవా లాంటి స్వీట్లను తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
రాజస్థాన్ ప్రభుత్వం బాల గోపాల్ యోజన పథకం కింద ఫ్రిగా మిల్క్ పౌడర్ ఇస్తోంది. అక్కడి నుంచి మిల్క్ పౌడర్‌ను నిర్వాహకులు తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఆ మిల్క్ పౌడర్‌లో రకరకాల కెమికల్స్ కలిపి స్వీట్లు తయారు చేస్తున్నారు. తనిఖీలతో ఫేక్ స్వీట్ల బండారం బయటపడింది. ఎంతకాలంగా ఫేక్ దందా చేస్తున్నారు..? ఏయే ఏరియాలకు సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు, అధికారులు ఆరాతీస్తున్నారు.