AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2024: అమెరికా, వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ..! టీ20 వరల్డ్‌కప్‌ వేదికలో మార్పు..! టోర్నీ ఏ దేశంలో జరగనుందంటే..?

T20 WC 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2024 వేదిక గురించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందుగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా..

T20 WC 2024: అమెరికా, వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ..! టీ20 వరల్డ్‌కప్‌ వేదికలో మార్పు..! టోర్నీ ఏ దేశంలో జరగనుందంటే..?
T20 WC 2024
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 05, 2023 | 6:47 PM

Share

T20 WC 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2024 వేదిక గురించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందుగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ టీ20 ప్రపంచకప్‌ వంటి ఐసీసీ టోర్నీలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికాలో ఇంకా సిద్దంగా లేవని తెలుస్తోంది. పైగా ఈ టోర్నీ ప్రారంభమయ్యేందుకు ఇంకా సంవత్సర కాలం మాత్రమే మిగిలి ఉంది.

అయితే ఐసీసీ నిర్దేశించిన మౌలిక సదుపాయాలను అమెరికా ఏర్పాటు చేయడం దాదాపుగా కష్టమే. ఈ నేపథ్యంలో టీ20 టోర్నీ వేదికను మార్చాలనే ఆలోచనలో ఐసీసీ ఉందని సమాచారం. అయితే అయితే టీ20 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లను వెస్టిండీస్‌ ఇంతకముందు ఎన్నో సార్లు నిర్వహించినప్పటకీ.. అమెరికాకు మాత్రం ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిధ్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి. ఈ మేరకు వచ్చే ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీని ఇంగ్లాండ్‌కు తరలించాలిని.. ఇప్పటికే ఈ విషయంపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుతో ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది.

కాగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకారం టీ20 ప్రపంచకప్‌-2030 ఆతిథ్య హక్కలను యూకే(ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్‌లాండ్‌) దక్కించుకుంది. అలాగే టీ20 ప్రపంచకప్‌-2024 ఆతిథ్య హక్కలను వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగాల్సిన టోర్నీని ఇంగ్లాండ్ తదితర దేశాలు నిర్వహిస్తే.. టీ20 ప్రపంచకప్‌-2030 టోర్నీని వెస్టిండీస్‌, అమెరికా నిర్వహించేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..