IPL 2024-CSK: సమయం వచ్చేసింది..! ఆ ముగ్గురుకి గుడ్‌బై చెప్పబోతున్న ధోని సేన.. కారణం ఏమిటంటే..?
Chennai Super Kings: ఐపీఎల్ 16వ సీజన్ పుణ్యమా అని దాదాపు 2 నెలల పాటు యావత్ క్రికెట్ ప్రపంచం వినోదంలో మునిగితేలింది. ఐపీఎల్ ట్రోఫీ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడగా.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి చెన్నై సూపర్ కింగ్స్
Chennai Super Kings: ఐపీఎల్ 16వ సీజన్ పుణ్యమా అని దాదాపు 2 నెలల పాటు యావత్ క్రికెట్ ప్రపంచం వినోదంలో మునిగితేలింది. ఐపీఎల్ ట్రోఫీ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడగా.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ విజేతంగా అవతరించింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో 12 సార్లు ప్లేఆఫ్స్, 10 సార్లు ఫైనల్స్ ఆడిన ఒకే ఒక జట్టుగా.. ఇంకా అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్‌గా ముంబై పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. అయితే ఐపీఎల్ 16వ సీజన్‌లో తమ జట్టుకు ఏ విధంగానూ ఉపయోగపడని ఆటగాళ్లకు ఉద్వాసన పలికే పనిలో పడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలో ఓ ముగ్గురు విదేశి ప్లేయర్లను వదిలేయాలనుకుంటోంది. మరి ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
మిచెల్ శాన్‌ట్నర్: అవకాశం వచ్చిన ప్రతిసారీ మెరుగ్గానే రాణంచాడు ఈ కివీస్ బౌలర్. అయితే మహీష్ తీక్షణ వైపే మొగ్గు చూపిన ధోని సేన.. శాన్‌ట్నర్‌కు అవకాశాలు ఇవ్వడం మానేసింది. చెన్నై తరఫున ఐపీఎల్ 2019 సీజన్‌లో ధనాధన్ లీగ్‌లో ఆరంగేట్రం చేసిన శాన్‌ట్నర్ ఇప్పటి వరకు 15 మ్యాచులే ఆడాడంటేనే ధోని సేన అతన్నిఎంతగా విస్మరించిందో అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మిచెల్ శాన్‌ట్నర్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ వదిలేయాలని భావిస్తోందని సమాచారం.
సిసంద మగల: సౌతాఫ్రికా తరఫున గతంలో చెలరేగిన ఆల్‌రౌండర్ సిసంద మగలకు ఐపీఎల్ 16వ సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అవకాశం లభించి ఆడిన మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపించలేదు. పైగా ఈ సీజన్ విజేతగా నిలిచిన చెన్నై టీమ్ కోసం అతను చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో మగలను కూడా టీమ్ నుంచి తొలగించాలని చెన్నై మేనేజ్‌మెంట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెన్ స్టోక్స్: ధోనీ వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని బెన్ స్టోక్స్ నడిపిస్తాడని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ కారణంగానే టోర్నీకి ముందు జరిగిన మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది చెన్నై. అయితే ఈ సీజన్‌లో చెన్నై తరఫున పెద్దగా కనిపించలేదు. ఆడిన కొన్ని మ్యాచుల్లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో చేతులెత్తేశాడు. దీంతో స్టోక్స్ అవసరం టీమ్‌కి లేదని, అతన్ని వదిలేయడమే సబబని చెన్నై ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..