- Telugu News Photo Gallery Cricket photos CSK Star Ruturaj Gaikwad Marries Utkarsha Pawar, Shares Beautiful Pictures From Ceremony
Ruturaj-Utkarsha Marriage: ప్రేయసిని వివాహమాడిన చెన్నై టీమ్ ఓపెనర్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..
Ruturaj Marraige: ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సాధించిన విజయం కోసం రుతురాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంకా ఫైనల్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనితో కలిసి రుతురాజ్, ఉత్కర్ష తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
Updated on: Jun 04, 2023 | 11:56 AM

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర మహిళల జట్టు ఆల్‌రౌండర్ ఉత్కర్ష పవార్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు.

శనివారం ముంబైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం జరిగింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఓ ఇంటివారయ్యారు.

ఇక వారి వివాహానికి సంబంధించిన ఫోటోలను రుతురాజ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.

రుతురాజ్-ఉత్కర్ష పెళ్లి ఫోటోలపై పలువురు క్రికెటర్లు, సెలబ్రెటీలు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ఇక రుతురాజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ అతని భార్య ఉత్కర్ష గురించి చాలా మందికి తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర మహిళల జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడుతున్న ఆమె ఇప్పటివరకు10 మ్యాచ్‌లు ఆడి.. 5 వికెట్లు పడకొట్టింది.

ప్రస్తుతం ఉత్కర్ష పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్‌లోచదువుతోంది. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సాధించిన విజయం కోసం రుతురాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంకా ఫైనల్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనితో కలిసి తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.




