AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: పిచ్‌తోనే పిచ్చెక్కించారుగా.. టీమిండియా కొంప ముంచేందుకేనా? ఫైరవుతోన్న ఫ్యాన్స్..

WTC Final 2023: అయితే, ఓవల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఉపరితలం బయటకు వచ్చింది. పిచ్ మొత్తం పచ్చగడ్డితో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో టీమిండియా ఆటగాళ్లలతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన పెంచింది.

WTC Final 2023: పిచ్‌తోనే పిచ్చెక్కించారుగా.. టీమిండియా కొంప ముంచేందుకేనా? ఫైరవుతోన్న ఫ్యాన్స్..
Wtc Final London Picth
Venkata Chari
|

Updated on: Jun 06, 2023 | 9:00 PM

Share

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో రేపటి నుంచి (జూన్ 7) ప్రారంభం కానున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే, ఓవల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఉపరితలం బయటకు వచ్చింది. పిచ్ మొత్తం పచ్చగడ్డితో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో టీమిండియా ఆటగాళ్లలతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన పెంచింది.

ఎందుకంటే గ్రీన్ పిచ్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. గ్రీన్ సర్ఫేస్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గంధామంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని పిచ్‌పై పేసర్లు మెరుగ్గా స్వింగ్ చేయగలరు. అలాగే అనుకోని బౌన్సర్లు ఎదురవుతాయి. దీనికి తోడు బంతి వేగంగా బౌన్స్ అవుతుండటంతో బౌలర్‌ను అడ్డుకోవడం బ్యాట్స్ మెన్ కు పెద్ద సవాల్ గా మారనుంది.

టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌పై ఆధారపడే జట్టు. ఆస్ట్రేలియా జట్టు పేసర్ల ముందు నిలవడం భారత జట్టుకు ఓ సవాల్‌గా మారనుంది. అయితే, భారత జట్టులో అత్యుత్తమ పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ప్రముఖ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫైనల్‌కు అందుబాటులో లేడు.

ఇవి కూడా చదవండి

అయితే ఎడమచేతి వాటం పేసర్‌గా మిచెల్ స్టార్క్, రైట్ ఆర్మ్ పేసర్ పాట్ కమిన్స్ మద్దతునిస్తారు. దీనికి తోడు స్కాట్ బోలాండ్ కూడా రంగంలోకి దిగడం ఖాయం. అలాగే ఆల్ రౌండర్ గా కనిపించనున్న కెమరూన్ గ్రీన్ కూడా ఫాస్ట్ బౌలర్.

అంటే ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ లో నలుగురు పేసర్లు కనిపించడం దాదాపు ఖాయమని తెలుస్తుంది. అందుకే పచ్చటి పిచ్ పై ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం టీమిండియా బ్యాటర్లకు సవాల్ గా మారనుంది. మరి భారత జట్టు ఈ సవాల్‌ను ఎదుర్కొని ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

స్క్వాడ్‌లు:

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , మార్కస్ హారిస్.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్ , జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..