AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: కనీస మద్ధతు ధరల పెంపుపై ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు.. తెలంగాణ రైతులు ఎంతో లాభపడ్డారంటూ..

ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలను పెంచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం కనీస మద్ధతు ధరలు పెరగడం వల్ల తెలంగాణ రైతులు ఎంతో లాభపడ్డారని...

Narendra Modi: కనీస మద్ధతు ధరల పెంపుపై ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు.. తెలంగాణ రైతులు ఎంతో లాభపడ్డారంటూ..
Union Minister Kishan Reddy and PM Modi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 07, 2023 | 8:59 PM

Share

ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలను పెంచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం కనీస మద్ధతు ధరలు పెరగడం వల్ల తెలంగాణ రైతులు ఎంతో లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ‘రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల మార్కెటింగ్ సీజన్ 2023-24 కోసం కనీస మద్ధతు ధరలను పెంచింది. 2014 నుంచి తెలంగాణ రైతులు ఎంఎస్‌పి పెంపుతో ఎంతో ప్రయోజనం పొందార’ని కేంద్ర మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే ప్రధాన పంటలకు 2014 నుంచి సగటున 60-80 శాతం కనీస మద్ధతు ధర పెరగడం వల్ల తెలంగాణ రైతులు ఎంతో ప్రయోజనం పొందారని. పొద్దుతిరుగుడు, పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటలకు కూడా పెంచిన ధరలను హైలైట్ చేశారు కిషన్ రెడ్డి. ‘2014 నుంచి 80 శాతం కంటే ఎక్కువ కనీస మద్ధతు ధర పెరగడంతో సన్‌ఫ్లవర్ అత్యధిక వృద్ధిని సాధించింది. తెలంగాణ చేనేత, జౌళి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 2014 నుంచి పత్తికి 75 శాతం కనీస మద్ధతు ధర పెరిగింది. దేశంలోనే వరి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నందున 2014 నుంచి వరి, మొక్కజోన్నలకు సుమారు 60 శాతం ధర పెరగడం అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చింద’ని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇంకా 2018-19 కేంద్ర బడ్జెట్‌లో సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం 50 శాతం స్థాయిలో కనీస మద్ధతు ధరని నిర్ణయించే ప్రకటనకు అనుగుణంగా MSP పెరుగుదల జరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పండించే వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి వంటి పంటలకు ఉత్పత్తి వ్యయంపై రైతులకు అంచనా వేసిన మార్జిన్ కనీసం 50 శాతం ఉంటుందని మంత్రి ఆ ప్రకటన ద్వారా తెలిపారు.

2014 నాటి నుంచి 2023-2024 మార్కెటింగ్ సీజన్ వరకు పంటలకు పెరిగిన కనీస మద్ధతు ధర వివరాలు

వరి -కామన్ 1360 నుంచి 2183 (61 శాతం పెరుగుదల)

వరి-గ్రేడ్ ఏ 1400 నుంచి 2203 (57 శాతం పెరుగుదల)

మొక్కజొన్న 1310 నుంచి 2090 (60 శాతం పెరుగుదల)

సన్‌ఫ్లవర్ సీడ్ 3750 నుంచి 6760 (80 శాతం పెరుగుదల)

పత్తి (మీడియం స్టేపుల్) 3750 నుంచి 6620 (77 శాతం పెరుగుదల)

పత్తి (లాంగ్ స్టేపుల్) 4050 నుంచి 7020 (73 శాతం పెరుగుదల)

2014 నాటి నుంచి 2023-2024 మార్కెటింగ్ సీజన్ వరకు సగటు ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల

వరి -కామన్ 2183 నుంచి 1455 (50 శాతం పెరుగుదల)

మొక్కజొన్న 2090 నుంచి 1394 (50 శాతం పెరుగుదల)

సన్‌ఫ్లవర్ సీడ్ 6760 నుంచి 4505 (50 శాతం పెరుగుదల)

పత్తి (మీడియం స్టేపుల్) 6620 నుంచి 4411 (50 శాతం పెరుగుదల)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..