Telangana: ‘ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. లక్షలు సంపాదించడి’.. ‘వైన్’ పేరుతో భారీ మోసం..
మా యాప్ లో పెట్టుబడి పెట్టండి.. లక్షల రూపాయలు పొందడం.. ఉత్తుత్తి ప్రచారం కాదు నిజంగా నిజం. 60 రోజుల్లోనే మీ డబ్బులు డబుల్ అవడం ఖాయం. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఓ యాప్ నిర్వహకులు చేసిన ప్రచారం. ఫలితంగా ఆ యాప్ ను నమ్మి పెట్టుబడి పెట్టిన వేల మంది డబ్బులు పోగొట్టుకుని
మా యాప్ లో పెట్టుబడి పెట్టండి.. లక్షల రూపాయలు పొందడం.. ఉత్తుత్తి ప్రచారం కాదు నిజంగా నిజం. 60 రోజుల్లోనే మీ డబ్బులు డబుల్ అవడం ఖాయం. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఓ యాప్ నిర్వహకులు చేసిన ప్రచారం. ఫలితంగా ఆ యాప్ ను నమ్మి పెట్టుబడి పెట్టిన వేల మంది డబ్బులు పోగొట్టుకుని బాదితులుగా మారిన పరిస్థితి. ఇంతకీ ఆ యాప్ ఏంటీ అందులో పెట్టుబడులు పెట్టి మోసం పోయిన బాదితుల గోడేంటి.
తాగు..తాగించు..కొను.. కొనిపించు.. కిక్కుకు కిక్కు.. లక్కుకు లక్.. ఒన్‌టైమ్ పెట్టుబడి.. రెగ్యులర్‌గా రాబడి.. ది వైన్ యాప్.. ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. కిక్ ఇస్తది.. లక్ వస్తది.. లక్షల్లో పనిలేదు కాదు.. వందలూ వేలు చాలు.. మంచిర్యాల జిల్లాలో ఇదే మాటలు విని వేలాది మంది డబ్బులు కట్టి ఇప్పుడు లబోదిబోమంటున్నారు ఎంతో మంది బాధితులు.
ది వైన్ గ్రూప్ (TWG) పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ అయింది. వాటిని లోకల్ వాట్సాప్, ఇన్‌స్టా గ్రూపుల్లో లింకులు పెట్టి.. జనాల్ని ఆకర్షించారు. చైన్ సిస్టాన్ని క్రియేట్ చేసి యాప్‌లో జాయిన్ అయ్యేలా చేశారు. ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని నమ్మబలికారు.. కేవలం రూ. 3,000 లతో ఎంట్రీ అయితే చాలు.. రెండు నెలల్లో ఆ సొమ్ము మూడు రెట్లు అవుతుందని నమ్మబలికారు. రెట్టింపు ఆశతో రెచ్చిపోయి మరి వైన్‌యాప్‌లో లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సడన్‌గా వైన్‌యాప్ కనుమరుగైంది. మద్యంబాబులకు కన్నీరు మిగిలింది.
దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ కింద దాదాపు 1.3 మిలియన్ మంది వినియోగదారులు ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాదు ఇటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోను వేలాది మంది ఈ నెట్వర్క్ కింద జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందెడ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున బాధితులు ఉన్నట్టుగా సమాచారం.
టీవీ9 కథనాలతో ది వైన్ యాప్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వహకులు.. వాట్సాప్ గ్రూపులపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు మొదలైంది. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమను సంప్రదించాలని కోరారు పోలీసులు. తమను సంప్రదించే బాధితుల వివరాలు గోప్యంగా వుంచుతామని భరోసానిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..