WTC Final 2023: హిట్‌మ్యాన్ ఖాతాలో సరికొత్త రికార్డ్.. సచిన్, సెహ్వాగ్ తర్వాత, మూడో ప్లేయర్‌గా..
WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు టీమిండియా ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే(20) ఉన్నారు. అంతకముందు ఓపెనర్‌గా వచ్చి..
WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు టీమిండియా ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే(20) ఉన్నారు. అంతకముందు ఓపెనర్‌గా వచ్చి శుభమాన్ గిల్(18)తో కలిసి దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 60 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో మొత్తం 43 పరుగులు చేశాడు. రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడబోతున్నాడని అందరూ భావిస్తొన్న సమయంలో నాథన్ లియాన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే తన 43 పరుగుల ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఓ ఘనత సాధించాడు.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంకా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మ్యాన్‌గా కూడా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ ఈ ఘనత సాధించారు. ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ 15 వేల 758 పరుగులు, సచిన్ 15 వేల 335 రన్స్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఓపెనర్‌గా 12973 పరుగులు చేసిన రోహిత్.. జరుగుతున్న మ్యాచ్‌లో 58(15, 43) రన్స్ చేశాడు. దీంతో ఓపెనర్‌గా 13 వేల మార్క్‌ను దాటడంతో పాటు మొత్తం 13031 రన్స్ చేశాడు.
ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్లు
వీరేంద్ర సెహ్వాగ్- 15 వేల 758 పరుగులు
సచిన్ టెండూల్కర్- 15 వేల 335 పరుగులు
రోహిత్ శర్మ- 13 వేల పరుగులు
సునీల్ గవాస్కర్- 12 వేల 258 పరుగులు
శిఖర్ ధావన్- 10 వేల 746 పరుగులు
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్) శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..