IND vs AUS WTC Final: చరిత్ర సృష్టిస్తారా? చతికిల పడతారా? టీమిండిమా ఆశలన్నీ కోహ్లీ, రహానేపైనే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే భారత్‌పై ఎడ్జ్ సాధించిన ఆస్ట్రేలియా.. టీమ్ ఇండియా ముందు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే భారత్‌పై ఎడ్జ్ సాధించిన ఆస్ట్రేలియా.. టీమ్ ఇండియా ముందు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (44), రహానె (20)ఉన్నారు. రోహిత్ శర్మ (43), గిల్ (18), పుజారా (27) పెవిలియన్ చేరారు. టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. మరి లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను అందుకుంటారో, చతికిల పడతారో అన్నది రేపు తేలిపోనుంది. ఆఖరి రోజు సుమారు 90 ఓవర్లు ఉన్నాయి. టీమిండియా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
కాగా లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియాకు శుభారంభమే దక్కింది. రోహిత్, గిల్ దూకుడగా ఆడారు. 7 ఓవర్లకు 41/0తో నిలిచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఏర్పడుతున్న సమయంలో గిల్‌ను బొలాండ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే గ్రీన్ పట్టిన క్యాచ్ నాటౌట్ అని స్పష్టంగా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువలో ఉండగా రోహిత్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే పుజారా వికెట్ కీపర్ క్యారీకి దొరికిపోయాడు. దీంతో 93 పరుగులకే టీమ్‌ఇండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానె మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.




That’s Stumps on Day 4 of #WTC23 Final!
We have an action-packed Day 5 in store tomorrow! #TeamIndia reach 164/3 and need 280 more runs to win, with @imVkohli & @ajinkyarahane88 at the crease ????
Scorecard ▶️ https://t.co/0nYl21oYkY pic.twitter.com/0frfkWrEp0
— BCCI (@BCCI) June 10, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




