AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Lakshman: మీరు రియల్ హీరోలు సార్‌.. వృద్ధాశ్రమం కోసం జోలి పట్టి భిక్షాటన చేసిన ఫైట్‌ మాస్టర్స్ రామ్‌ లక్ష్మణ్‌

సినీ పరిశ్రమలో ఎపుడు బిజీగా గడిపే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కాస్తంత ఖాళీదొరికితే చాలు తమ సొంత గ్రామంలో వాలిపోతుంటారు . గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

Ram Lakshman: మీరు రియల్ హీరోలు సార్‌.. వృద్ధాశ్రమం కోసం జోలి పట్టి భిక్షాటన చేసిన ఫైట్‌ మాస్టర్స్ రామ్‌ లక్ష్మణ్‌
Ram Lakshman
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 6:05 AM

Share

సినీ పరిశ్రమలో ఎపుడు బిజీగా గడిపే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కాస్తంత ఖాళీదొరికితే చాలు తమ సొంత గ్రామంలో వాలిపోతుంటారు . గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలోని కోటయ్య వృద్ధాశ్రమాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు ఖాళీదొరికినప్పుడల్లా సందర్శిస్తుంటారు .అంతేకాకుండా తమకు సాధ్యమేనంత వరకు వ్యక్తిగత సహాయాన్ని అందిస్తుంటున్నారు . అయితే ఆసారి కాస్తంత వినూత్నంగా ఆలోచించారు. ఆ ఆశ్రమానికి తమ వ్యక్తిగత సహాయంతో పాటుగా సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలనుకున్నారు .ఈ క్రమంలోనే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు స్వయంగా చీరాల పట్టణంలోని పలు ప్రాంతాలలో జోలి బట్టి బిక్షాటన చేశారు . స్వయంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులే సహాయాన్ని కోరడంతో పట్టణంలోని దుకాణాలు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు ,రహదారుల పై వెళుతున్న ప్రజలు బిక్షాటం చేసేందుకు ముందుకు వచ్చారు. బిక్షాటన ద్వారా సేకరించిన నగదుతో పాటుగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు కొంత నగదు అందించి వాహనం కొనుగోలు నిమిత్తం ఆశ్రమ నిర్వాహకులకు నగదును అందజేశారు.

ఈసందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు మాట్లాడుతూ సామజిక సేవా కార్యక్రమలలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు .”మానవసేవే మాధవసేవ” అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు .అపుడే సమాజం బాగుంటుందన్నారు .అనంతరం కోటయ్య వృద్దాశ్రమాన్ని రామ్ లక్ష్మణ్‌లు సందర్శించారు.ఆశ్రమంలోని వృద్ధులతో కొద్దిసేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పించిన నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు.

ఇవి కూడా చదవండి
Ram Lakshman 1

Ram Lakshman

– ఫైరోజ్ బేగ్, టీవీ 9 రిపోర్టర్, ఒంగోలు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!