Adipurush: రణ్‌బీర్ కపూర్ మంచి మనసు.. పేద పిల్లల కోసం ‘ఆదిపురుష్’ 10 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మేనియా కొనసాగుతోంది. రిలీజ్ కి ముందే స్పెషల్ బుకింగ్స్ తో సంచలనాలు సృష్టిస్తోంది ప్రభాస్ సినిమా. బుధవారం ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఉచితంగా పదివేల ఆది పురుష్ సినిమా టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాల కు ఈ టికెట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి అవతారంలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమా విడుదల కోసం అభిమానులతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణ మహాకావ్యం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నటించారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్, రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మేనియా కొనసాగుతోంది. రిలీజ్ కి ముందే స్పెషల్ బుకింగ్స్ తో సంచలనాలు సృష్టిస్తోంది ప్రభాస్ సినిమా. బుధవారం ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఉచితంగా పదివేల ఆది పురుష్ సినిమా టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాల కు ఈ టికెట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా బాలీవుడ్ రాక్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ ఆదిపురుష్ సినిమా 10,000 టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక కారణాలతో సినిమా చూడలేని నిరుపేద పిల్లల కోసం ఈ టికెట్లను బుక్ చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‍బీర్ కపూర్ చేసిన పనిని అభిమానులు, నెటిజన్లు హర్షిస్తున్నారు. ఆయనను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ప్రభాస్ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేషన్‍ను ఇచ్చింది. దీంతో పాటు సినిమా రన్ టైమ్ కూడా ఖరారైంది. ఈ సినిమా మొత్తంగా 179 నిమిషాల (2 గంటల 59 నిమిషాలు) నిడివి ఉండనుంది.
#Xclusiv… RANBIR KAPOOR TO BOOK 10,000 TICKETS OF ‘ADIPURUSH’ FOR UNDERPRIVILEGED CHILDREN… OFFICIAL POSTER…#RanbirKapoor #Adipurush #Prabhas #KritiSanon #SaifAliKhan #SunnySingh #DevdattaNage pic.twitter.com/k30OUNvO9G
— taran adarsh (@taran_adarsh) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..