Actress: స్విమ్మింగ్‌ పూల్‌లో సొర చేప.. ఇప్పుడు మాత్రం పాన్‌ ఇండియా హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి రాకముందు ప్రొఫెషనల్‌ స్విమ్మర్‌. ఈత కొలనులో దిగితే పతకాలు మెడలో పడాల్సిందే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం ఎన్నో పతకాలను గెల్చుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Actress: స్విమ్మింగ్‌ పూల్‌లో సొర చేప.. ఇప్పుడు మాత్రం పాన్‌ ఇండియా హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 6:24 AM

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌. ఇప్పటివరకు చేసింది కేవలం 2 సినిమాలే. అందులో ఒక సినిమా ఆమెకు ఎనలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అందులో అమాయకచూపులతో కనిపించే ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా కూడా భారీ విజయం సాధించడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇటీవలే మరో పాన్‌ ఇండియా సినిమాకు కూడా సైన్‌ చేసింది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి రాకముందు ప్రొఫెషనల్‌ స్విమ్మర్‌. ఈత కొలనులో దిగితే పతకాలు మెడలో పడాల్సిందే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం ఎన్నో పతకాలను గెల్చుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా.. అయితే నో ప్రాబ్లమ్ సమాధానం కూడా మేమే చెబుతాం లెండి.. ఆమె మరెవరో కాంతారా సినిమాతో ఓవర్‌నైట్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న సప్తమి గౌడ.

కర్ణాటకకు చెందిన సప్తమి గౌడ 5 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. తండ్రి ఉమేశ్‌ పోలీస్‌ అధికారి కావడంతో తనను మరింత ప్రోత్సాహించారు. అలా చిన్న వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయి ఈత పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. అంతేకాదు ట్రయాథ్లాన్ అథ్లెటిక్స్‌ పోటీల్లోనూ ఈ అందాల తార ప్రావీణ్యం సంపాదించింది. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా కూడా పని చేసింది. అయితే ఆ తర్వాత నటనపై మక్కువ పెంచుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2020లో దునియా సూరి పాప్‌కార్న్ మంకీ టైగర్‌ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆ వెంటనే కాంతారాతో పాన్‌ ఇండియా మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కశ్మీర్ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కిస్తోన్న ది కరోనా వ్యాక్సిన్‌లోనూ సప్తమి కథానాయికగా ఎంపికైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..