Adipurush: ప్రభాస్‌ ఆదిపురుష్‌ థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ.. స్పందించిన మూవీ యూనిట్‌

కాగా రాముని బంటు హనుమంతుడి కోసం ఆదిపురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్‌ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఆదిపురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

Adipurush: ప్రభాస్‌ ఆదిపురుష్‌ థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ.. స్పందించిన మూవీ యూనిట్‌
Adipurush Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 5:55 AM

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, జానకిగా బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ కనిపించనున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్ర పోషించారు. ఆది పురుష్‌ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించగా, రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. కాగా రాముని బంటు హనుమంతుడి కోసం ఆదిపురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచనున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్‌ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఆదిపురుష్‌ ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

నెట్టింట వైరలవుతున్న ఈ వివాదంపై ఆదిపురుష్ చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ చిత్రంపై దుష్ప్రచారం జరుగుతోందని ప్రకటించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ప్రచారాలు సినిమాను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నాయని, వీటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. ఏ కుల, మత, వర్ణ వివక్షతకు తావులేకుండా సమానత్వం కోసం ఆదిపురుష్ బృందం శ్రమించిందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకుని ఆదిపురుష్‌ టీమ్‌కు సహకరించాలని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా ప్రతీ భారతీయుడిదని చిత్రబృందం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..