Actress: ఈ ఫొటోలోని ప్రముఖ నటిని గుర్తుపట్టారా? తెలుగు నాట అమ్మ, బామ్మ పాత్రలకు ప్రాణం పోసిందండోయ్‌..

ఈ ఫొటోలోని అందమైన అమ్మాయిని గుర్తుపట్టారా? ఈమె తెలుగు నాట బాగా ఫేమస్‌. మొదట కథానాయికగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన అందం, అభినయంతో అందరి మెప్పుపొందారు. మొత్తం మీద 800 సినిమాల్లో నటించి మెప్పించారామె.

Actress: ఈ ఫొటోలోని ప్రముఖ నటిని గుర్తుపట్టారా? తెలుగు నాట అమ్మ, బామ్మ పాత్రలకు ప్రాణం పోసిందండోయ్‌..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2023 | 6:15 AM

ఈ ఫొటోలోని అందమైన అమ్మాయిని గుర్తుపట్టారా? ఈమె తెలుగు నాట బాగా ఫేమస్‌. మొదట కథానాయికగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన అందం, అభినయంతో అందరి మెప్పుపొందారు. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కథానాయికల కెరీర్‌ చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా వయసైపోయిన కథానాయికలు ఇతర పాత్రల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కొందరైతే ఇండస్ట్రీకి దూరమైపోతారు. కానీ ఈ దిగ్గజ నటి మాత్రం యాక్టింగ్‌పై మక్కువతో కొన్ని జనరేషన్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. అమ్మ, పాత్రలను కూడా పోషించారు. కథానాయిక కంటే ఈ పాత్రలోనే తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుందామె. మొత్తం మీద 800 సినిమాల్లో నటించి మెప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్‌లో బామ్మ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరో గురించి మాట్లాడుకుంటున్నామో. యస్‌.. ఆమె మరెవరో తెలుగింటి బామ్మ నిర్మలమ్మ.

టాలీవుడ్ లోని దిగ్గజ నటీమణుల్లో నిర్మలమ్మ కూడా ఒకరు. ఆమె అసలు పేరు రాజామణి కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిర్మలమ్మ గా పేరు మార్చుకున్నారు. చిన్నప్పటి నుంచే నిర్మలమ్మకు నాటకాలు అంటే ఎంతో ఆసక్తి ఉండేది. మూడో తరగతిలోనే చదువు మానేసి నాటకాలలో నటించడం మొదలు పెట్టారామె. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకిఅడుగుపెట్టి తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్ననారు. యవ్వనంలో నిర్మలమ్మ ఎంతో అందంగా ఉండేవారు. దీంతో హీరోయిన్ గా కూడా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత స్టార్‌ హీరోలకు అమ్మగా, బామ్మగా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ, యస్వీఆర్ ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి ఎందరి హీరోలతో కలిసి నటించారామె. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మలమ్మ చివరిసారిగా 2002లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రేమకు స్వాగతం అనే సినిమాలో నటించారు.

ఇవి కూడా చదవండి
Actress Nirmalamma

Actress Nirmalamma

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.