Udayanidhi Stalin: ఇకపై సినిమాలు చేయను.. తల్లి, భార్య సమక్షంలో ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం

రాజకీయాల సంగతి పక్కన పెడితే కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా కూడా రాణిస్తున్నాడు స్టాలిన్‌. శీనుగాడి లవ్‌ స్టోరీ, ఓకే ఒకే, సైకో తదితర డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. కాగా గతంలోనే సినిమాలు చేయనంటూ ప్రకటించాడు స్టాలిన్‌. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. పలు మూవీస్‌కు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Udayanidhi Stalin: ఇకపై సినిమాలు చేయను.. తల్లి, భార్య సమక్షంలో ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం
Udayanidhi Stalin
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 11:43 AM

తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రస్తుతం తమిళనాడు క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన యూత్ వెల్ఫేర్, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే కోలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా కూడా రాణిస్తున్నాడు స్టాలిన్‌. శీనుగాడి లవ్‌ స్టోరీ, ఓకే ఒకే, సైకో తదితర డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. కాగా గతంలోనే సినిమాలు చేయనంటూ ప్రకటించాడు స్టాలిన్‌. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. పలు మూవీస్‌కు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తన మాటకు కట్టుబడుతూ మంత్రి అయిన తర్వాత మాత్రం సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఈక్రమంలో అతను నటించిన చివరి చిత్రం మామన్నన్‌ మరికొన్ని రోజల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. కమల్‌హాసన్‌, శివకార్తికేయన్‌, విజయ్‌ ఆంటోని, సూరి.. దర్శకులు వెట్రిమారన్‌, రంజిత్‌, ఏఎల్‌.విజయ్‌ వంటి స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అలాగే సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక తదితరులు కూడా సందడి చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ సినిమాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనంటూ ప్రకటించారు. మామన్నన్‌ సినిమానే ఆఖరి చిత్రమని తల్లి, భార్య సమక్షంలో తెలిపారు. ‘ఇకపై సినిమాలు చేయను. మామన్నన్ లాంటి మంచి సినిమా నా చివరి సినిమా కావడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో నేను ఓ సినిమా చేయాలి. అయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాల్లో నటించడం సరికాదని నా అభిప్రాయం. అందుకే ఇక సినిమాలు ఆపేస్తున్నాను. ఒకవేళ మామన్నన్ దర్శకుడు మారి సెల్వరాజ్ కనుక మంచి కథతో మళ్లీ వస్తే మూడేళ్ల తర్వాత నటించడానికి ఆలోచిస్తాను’ అని పేర్కొన్నారు స్టాలిన్‌. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!