Shaitan: ఓటీటీలో రానున్న ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘సైతాన్‌’ సిరీస్ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల డైరెక్టర్లందరూ ఓటీటీల బాట పడుతున్నారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అలా యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్ కూడా సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు.

Shaitan: ఓటీటీలో రానున్న ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌.. 'సైతాన్‌' సిరీస్ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Shaitan Telugu Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2023 | 1:19 PM

ఇటీవల డైరెక్టర్లందరూ ఓటీటీల బాట పడుతున్నారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అలా యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్ కూడా సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. ఈ జోష్‌లో మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహి. వి. రాఘవ్‌. ఈసారి పూర్తిస్థాయి క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో సైతాన్‌ అనే సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సిరీస్‌లో కామాక్షి భాస్క‌ర్ల‌, దేవ‌యాని, రిషి, అనీషా దామా, నితిన్ ప్ర‌స‌న్న‌తో పాటు విక్ర‌మ్ ఫేమ్ జాఫ‌ర్ సాధిఖ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలి అనే వ్యక్తి కుటుంబం ఎందుకు క్రైమ్‌ మార్గాన్ని ఎంచుకుంది? ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ఇక సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 15 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల రిలీజైన సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ పోస్టర్‌లో ఓ పోలీస్‌ను మర్డర్‌ చేస్తూ ప్రధాన పాత్రదారులు కనిపించారు. దీన్ని బట్టి ఇది కాస్త వయలెన్స్‌ అండ్‌ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్‌ తర్వాత యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌. వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్‌గా యాత్ర -2 పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..