Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#Mentoo: థియేటర్లలో రిలీజైన 14 రోజులకే ఓటీటీలోకి.. #మెన్ టూ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు వెంటనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. సుమారు నెల రోజుల గ్యాప్‌ కూడా ఉండడం లేదు. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఓ సినిమా 14 రోజలు గ్యాప్‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అదే #మెన్‌ టూ.

#Mentoo: థియేటర్లలో రిలీజైన 14 రోజులకే ఓటీటీలోకి.. #మెన్ టూ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Mentoo Review
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2023 | 7:36 AM

ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు వెంటనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. సుమారు నెల రోజుల గ్యాప్‌ కూడా ఉండడం లేదు. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఓ సినిమా 14 రోజలు గ్యాప్‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అదే #మెన్‌ టూ. నరేశ్ అగస్త్య హీరోగా నటించగా.. బ్రహ్మజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో హాస్య ప్రధానంగా శ్రీకాంత్ జి. రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. మౌర్య సిద్దవరం నిర్మాణ బాధ్యతలు చేపట్టగా మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ తీసుకుంది. మే 26 న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఎంటర్‌ టైనర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే 14 రోజుల వ్యవధిలోనే #మెన్‌ టూను ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

జూన్ 9 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో #మెన్‌ టూ అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది ఆహా. సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ‘ ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌ మీ కోసమే.. # మెన్‌ టూ అంటూ వచ్చేస్తున్నారు’ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ సినిమాకు ఎలిషా ప్రవీణ్ జి, ఓషో వెంకట్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఫుల్లుగా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజ రూప దర్శనం ఎప్పుడంటే..
సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజ రూప దర్శనం ఎప్పుడంటే..
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్
ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..!
ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..!
MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన ధోని.. ఏమన్నాడంటే?
MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన ధోని.. ఏమన్నాడంటే?
నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం..
నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం..
JEE మెయిన్ 2025లో 2,50,236 మందిపాస్.. 2రోజుల్లో అడ్వాన్స్‌డ్ షురూ
JEE మెయిన్ 2025లో 2,50,236 మందిపాస్.. 2రోజుల్లో అడ్వాన్స్‌డ్ షురూ
గోల్డ్ లవ్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.?
గోల్డ్ లవ్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.?
నంబర్ 1ను ఢీ కొట్టనున్న నంబర్ 7.. ఓడితే లగేజ్ సర్దేయాల్సిందే
నంబర్ 1ను ఢీ కొట్టనున్న నంబర్ 7.. ఓడితే లగేజ్ సర్దేయాల్సిందే
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..