Sirf Ek Bandaa Kaafi Hai: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం.. ఉత్కంఠభరితంగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్..

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాన‌నే సంగ‌తి తెలుసు. దాని వ‌ల్ల ఎదుర‌య్యే ఇబ్బందులు ఎలా ఉంటాయ‌నేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్ర‌తిష్ట‌లున్న‌, అభిమాన గ‌ణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయ‌టానికి నిశ్చ‌యించుకుంటాడు.

Sirf Ek Bandaa Kaafi Hai: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం.. ఉత్కంఠభరితంగా 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ట్రైలర్..
Manoj Bajpayee
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:19 PM

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాన‌నే సంగ‌తి తెలుసు. దాని వ‌ల్ల ఎదుర‌య్యే ఇబ్బందులు ఎలా ఉంటాయ‌నేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్ర‌తిష్ట‌లున్న‌, అభిమాన గ‌ణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయ‌టానికి నిశ్చ‌యించుకుంటాడు. మ‌రి ఆ గాడ్ మ్యాన్ మీద ఈ కామ‌న్ మ్యాన్ విజ‌యాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ వెబ్ ఫిల్మ్‌.. జూన్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భ‌న్సాలి స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్‌ను తెర‌కెక్కించారు. నూసిన్ అనే మైన‌ర్ బాలిక‌తో ఓ స్వామిజీ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తుంది. దీంతో ఆ అమ్మాయికి అండ‌గా లాయ‌ర్ సోలంకి (మ‌నోజ్ బాజ్‌పాయి) నిల‌బ‌డ‌తాడు. అప్ప‌టి వ‌ర‌కు చేసిన పోరాటాల‌కు.. తానిప్పుడు చేయ‌బోయే పోరాటం ఎంతో వైవిధ‌మ్యైనదో తెలిసాని సోలంకి అమ్మాయికి త‌న మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తాడు. మ‌రి ఆ కేసులో గెలిచింది ఎవ‌రు? స్వామీజీకి శిక్ష ప‌డిందా? అనేది ఆస‌క్తిక‌రంగా, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

సోసైటీ కొంద‌రు మంచి అనే ముసుగు వేసుకుని చెడు ప‌నులు చేస్తుంటారు. అలాంటి ఓ బాబా ఓ మైన‌ర్ బాలికను ఇబ్బంది పెడ‌తాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంది. అయితే స‌ద‌రు బాబా అనుంగ భ‌క్తులు ఆ అమ్మాయిపై ఎదురు దాడికి దిగుతారు. అప్పుడు ఓ లాయ‌ర్ ఆ అమ్మాయి త‌ర‌పున నిల‌బ‌డి ఎలాంటి న్యాయం చేశాడ‌నే నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అంద‌రిలో సోష‌ల్ అవేర్‌నెస్‌ను క‌లిగించే చిత్ర‌మిది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే