Project K: ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.. ‘ప్రాజెక్ట్ కె’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రానా..

మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న ప్రాజెక్ కె సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా ఈ సినిమాపై దగ్గుబాటి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Project K: ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.. 'ప్రాజెక్ట్ కె' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రానా..
Rana, Prabhas
Follow us

|

Updated on: Jun 02, 2023 | 2:54 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాల కోసం పాన్ ఇండియా సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ పరచడంతో డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఆశలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఉండగా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని మరికొన్ని రోజుల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది ఆదిపురుష్ చిత్రం. జూన్ 16న ఈ సినిమా తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కాబోతుండగా.. జూన్ 6న తిరపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న ప్రాజెక్ కె సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా ఈ సినిమాపై దగ్గుబాటి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ కె సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. నేను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా ఓ తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్మకంగా ఉన్నాను.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో సినిమాను మరో హీరో సపోర్ట్ చేస్తూ సెలబ్రెట్ చేసుకుంటుంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఇక భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది ” అని అన్నారు.