Ram Pothineni: ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి.. బోయపాటి సినిమాపై రామ్ పోతినేని పోస్ట్..
ప్రస్తుతం RAPO 20 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచేసింది. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు హీరో రామ్ పోతినేని.
అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న బోయపాటి శ్రీను.. ఇప్పుడు రామ్ పోతినేనితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ హీరో, బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మాస్ ప్రేక్షకులకు ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బోయపాటి తెరకెక్కించే సినిమా యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం RAPO 20 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచేసింది. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు హీరో రామ్ పోతినేని.
‘మొత్తానికి 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తిచేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. CliMAXXXXX’ అంటూ ట్వీట్ చేశారు రామ్. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. మూవీ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమా పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఇందులో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవలే డబ్బింగ్ పనులను కూడా షూరు చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టనున్నారు రామ్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.
Finally! Done with the insane 24 days action sequence.
Idhi Climax kaadhu… CliMAXXXXX!
— RAm POthineni (@ramsayz) June 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.