Ram Charan: బంగారు తెలంగాణ కల నిజమవుతోంది.. ఆవిర్భావ దినోత్సవ వేళ చెర్రీ హైలెట్ ట్వీట్
తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం సిద్ధించిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. అధికారి బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు...
తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం సిద్ధించిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. అధికారి బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రులు జిల్లా్ల్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు.
ఇక కేవలం రాజకీయ నాయుకులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…
— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023
చెర్రీ ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాము. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాము. దశాబ్ధి వేడుకల సందర్భంగా తెలంగాణలోని బద్రర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. దీంతో చెర్రీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..