AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: వేల కోట్లకు యువరాణి మరీ ఇంత పొదుపా ?.. రూ.400 ఖర్చు చేయలేక హాట్ స్పాడ్ అడిగిందట..

ఈ క్రమంలోనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సారా చేసిన పని తెలిసి అంతా షాకవుతున్నారు. అదేంటంటే.. ఈ పటౌడీ క్వీన్ మహా పొదుపరి అంట. రూ. 400 ఖర్చు చేయడం కోసం వెనకడుగు వేసి.. తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ అడిగిందట. అయితే సారా పద్దతి చూసి విమర్శించిన వారే.. ఆమె ఆలోచనలు తెలిసి ప్రశంసిస్తున్నారు.

Sara Ali Khan: వేల కోట్లకు యువరాణి మరీ ఇంత పొదుపా ?.. రూ.400 ఖర్చు చేయలేక హాట్ స్పాడ్ అడిగిందట..
Sara Ali Khan
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2023 | 4:02 PM

Share

సారా అలీ ఖాన్.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. తాజాగా ఆమె హీరో విక్కీ కౌశల్ తో కలిసి నటించిన జరా హాట్కే జరా బచ్కే సినిమా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సారా చేసిన పని తెలిసి అంతా షాకవుతున్నారు. అదేంటంటే.. ఈ పటౌడీ క్వీన్ మహా పొదుపరి అంట. రూ. 400 ఖర్చు చేయడం కోసం వెనకడుగు వేసి.. తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ అడిగిందట. అయితే సారా పద్దతి చూసి విమర్శించిన వారే.. ఆమె ఆలోచనలు తెలిసి ప్రశంసిస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా.. వేల కోట్లకు యువరాణి. ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె.. ఇటీవలే ఓ అవార్డ్ షో కోసం విదేశాలకు వెళ్లింది. అయితే అక్కడ రోమింగ్ కోసం రూ. 400 చెల్లించాలని హోటల్ మేనేజ్మెంట్ వాళ్లు అడిగారట. దీంతో ఆమె ఒక్కరోజు రోమింగ్ కోసం అంత చెల్లించాలా.. అని తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ ఆన్ చేయాలని కోరిందట. అంతేకాకుండా.. తన తోటి నటీనటులను మీరంతా డబ్బు చెల్లించారా అని అడిగితే వాళ్లు రూ. 3000 పెట్టి నెల రోజులకు ప్యాకెజ్ తీసుకున్నామని చెప్పడంతో ఆమె షాకయ్యిందట. ఈవిషయాన్ని స్యయంగా సారా ఓ వీడియోలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా డబ్బును పొదుపు చేయడం వెనక సారా ఉద్ధేశ్యం వేరే ఉంది. తన దృష్టిలో డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్లే అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సారా పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఓ సినిమా షూటింగ్ సెట్ లో తన తల్లి రూ. 1600 పెట్టి ఓ టవల్ కొనడంతో ఆమెపై పెద్ద ఎత్తున సారా అరిచిందని.. చాలా కోప్పడిందని నటుడు విక్కీ కౌశల్ ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ