Custody OTT: ఓటీటీలోకి నాగచైతన్య రీసెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ .. కస్టడీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అక్కినేని నాగచైతన్య మొదటిసారి పోలీస్ గెటప్‌లో నటించిన చిత్రం కస్టడీ. బేబమ్మ కృతిశెట్టి మరోసారి చై సరసన సందడి చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

అక్కినేని నాగచైతన్య మొదటిసారి పోలీస్ గెటప్‌లో నటించిన చిత్రం కస్టడీ. బేబమ్మ కృతిశెట్టి మరోసారి చై సరసన సందడి చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. దీంతో చైతన్యకు యాక్షన్ సినిమాలు అచ్చిరావని మరోసారి రుజువైంది. అయితే ఎప్పటిలాగే కస్టడీలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు.. సినిమాలోని యాక్షన్ సీన్లు, వెంకట్ ప్రభు టేకింగ్ అదిరిపోయాయి. దీంతో చాలామంది కస్టడీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. కస్టడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈక్రమంలో జూన్ 9 లేదా 16 తేదీలలో ఓటీటీలో కస్టడీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఏకకాలంలో నాగచైతన్య స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కాగా కస్టడీ సినిమాలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్‌జీ అమరన్ కీలక పాత్రలు కనిపించారు. కెరీర్‌లో మొదటిసారి పోలీస్ గెటప్‌లో కనిపించాడు నాగచైతన్య. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి థియేటర్లలో కస్టడీ సినిమాను మిస్ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.