Aha OTT: ‘అర్థమైందా అరుణ్ కుమార్’.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

కార్పొరేట్ ఎంప్లాయిస్ జీవితాల ఒడిదొడుగులని తెలియచేసేలా ఓ కొత్త వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ నిర్మించింది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ బుధవారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది ఆహా. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అరుణ్ కుమార్ ముందా అనే వ్య‌క్తి జీవితంలో.. ఆఫీసులో జ‌రిగిన ఆక‌ర్షణీయ‌మైన అంశాల రూపొందుతోన్న ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’.

Aha OTT: ‘అర్థమైందా అరుణ్ కుమార్’.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Aha Ott
Follow us

|

Updated on: Jun 07, 2023 | 12:22 PM

ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు ఆన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆహా ఒరిజినల్ ఫిల్మ్ సత్తిగాని రెండెకరాలు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇప్పుడు సరికొత్త సిరీస్ తీసుకువస్తుంది. కార్పొరేట్ ఎంప్లాయిస్ జీవితాల ఒడిదొడుగులని తెలియచేసేలా ఓ కొత్త వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ నిర్మించింది . ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ బుధవారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది ఆహా. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అరుణ్ కుమార్ ముందా అనే వ్య‌క్తి జీవితంలో.. ఆఫీసులో జ‌రిగిన ఆక‌ర్షణీయ‌మైన అంశాల రూపొందుతోన్న ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. చిన్న పట్టణ ప్రాంతంలో నివసించే యువ‌కుడు అరుణ్ కుమార్‌, జీవితంలో ఏదో సాధించాల‌నే క‌ల‌ల‌తో ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగుపెడ‌తాడు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో కొత్త జ‌ర్నీని ప్రారంభించిన త‌న‌కు ఎదురైన ఆటు పోట్లు ఏంటి? వాటి వ‌ల్ల అత‌ను ఏం నేర్చుకున్నాడ‌నే క‌థాంశంతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్‌సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

అరుణ్ కుమార్ అనే యువకుడు అమ‌లాపురం అనే చిన్న ప‌ట్ట‌ణ ప్రాంతానికి చెందినవాడు. అతను చాలా సంతోషంగా సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతుంటాడు. అయితే జీవితంలో ఏదైనా సాధించాల‌నే కోరిక‌తో ఇంట‌ర్న్‌షిఫ్ ఉద్యోగిగా ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తాడు. అక్కడ ఇంగ్లీష్ భాష‌లో చేసే సంభాష‌ణ‌లు, ఆఫీసులోని రాజ‌కీయాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం, ఓ ప‌ద్ధ‌తి లేకుండా ప్ర‌ప‌వ‌ర్తించ‌టం ఇవ‌న్నీ అత‌నికి ఎదురుపడతాయి. త‌న తోటి ఉద్యోగులే అతన్ని చులకన చేస్తారు. అలాంటి సంద‌ర్భంలో తన విలువ ఏంటి ? అని ఒకానొక సందర్భంలో తనకు తానే ప్ర‌శ్నించుకుంటాడు. దాని వల్ల అరుణ్‌కుమార్‌కు త‌న చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న రావ‌ట‌మే కాకుండా త‌న‌లాంటి వ్య‌క్తికి అక్క‌డ విలువ‌లేద‌ని గ్ర‌హిస్తాడు. అయితే త‌ను చేయాల్సిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని త‌న‌లోని నిరాశ‌ను దూరం పెడ‌తాడు. ప‌ట్టుద‌ల‌తో త‌ను సాధించాల్సిన విష‌యంపై మ‌న‌సు ల‌గ్నం పెడ‌తాడు. దానిలో ఎలా విజ‌యం సాధించాడ‌నేదే క‌థాంశం.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌ను ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. హ‌ర్షిత్ రెడ్డి, అనన్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కార్పొరేట్ ఉద్యోగులు వారి ప్ర‌యాణంలో ప‌డే బాధ‌లు, వారి క‌ల‌ల‌ను సాధించే క్ర‌మంలో ఎదుర‌య్యే ఇబ్బందులు, సాధించే విజ‌యాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మ‌నం చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!