Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ రీరిలీజ్.. ‘లక్స్ పాప’ సాంగ్ 4k క్వాలిటీ ప్రోమో చూశారా ?..

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు సినిమా రీరిలీజ్ చేస్తున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001లో విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో బాలయ్యకు జోడిగా సిమ్రాన్, ప్రీతి జింగ్యాని నటించగా.. ఫ్లోరా షైని కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 10న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్.

Balakrishna: బాలకృష్ణ 'నరసింహ నాయుడు' రీరిలీజ్.. 'లక్స్ పాప' సాంగ్ 4k క్వాలిటీ ప్రోమో చూశారా ?..
Narasimha Naidu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2023 | 8:53 AM

రీరిలీజ్.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోస్ సూపర్ హిట్ మూవీస్ మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇక మరోసారి తమ ఫేవరేట్ స్టార్స్ సినిమాలను థియేటర్లలో వీక్షించేందుకు ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు సినిమా రీరిలీజ్ చేస్తున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001లో విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో బాలయ్యకు జోడిగా సిమ్రాన్, ప్రీతి జింగ్యాని నటించగా.. ఫ్లోరా షైని కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 10న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్.

తెలుగు రాష్ట్రాలతోపాటు.. అమెరికాలోనూ ఈ సినిమా రీరిలీజ్ కానుంది.ఇక 4K క్వాలిటీతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. లక్స్ పాప సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఆల్ టైమ్ హిట్. ఇందులో లక్స్ పాప సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే తాజాగా 4కె వెర్షన్లో రిలీజ్ అయిన లక్స్ పాప సాంగ్ మరోసారి శ్రోతలను ఊర్రూతలూగించనుంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్యకు జోడిగా కాజల్ నటిస్తుండగా.. కీలకపాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ బాలయ్య బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.