AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. డైరెక్టర్ ఎవరంటే..

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ మూవీపై మరో క్రేజ్ బజ్ నెలకొంది.

Jr.NTR: ఎన్టీఆర్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. డైరెక్టర్ ఎవరంటే..
Jr.ntr, Priyanka Chopra
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2023 | 8:21 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఓవైపు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ మూవీపై మరో క్రేజ్ బజ్ నెలకొంది.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె నుంచి మృణాల్ ఠాకూర్ వరకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి కట్టనున్నారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇవే కాకుండా.. ఈసారి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ 2 చిత్రంలో తారక్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించనున్నారట. వార్ ఫ్రాంచైజీ యొక్క రెండవ భాగాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!