2018 Movie: ఓటీటీలోకి వచ్చేసిన 2018 సినిమా.. తీవ్ర అభ్యంతరం.. సమ్మెకు పిలుపు.. అసలేం జరిగిందంటే..
కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన కేవలం ఐదు వారాల్లోనే జూన్ 7 నుంచి ఈ మూవీ సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఇదే విషయంపై కేరళ థియేటర్స్ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో 2018 ఒకటి. టోవినో థామస్ తెరకెక్కించిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేరళలో రిలీజ్ అయిన ఈ సినిమాకు తెలుగు, హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మే 26న తెలుగులో రిలీజ్ చేయగా.. పాజిటివ్ టాక్ వచ్చేసింది. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన కేవలం ఐదు వారాల్లోనే జూన్ 7 నుంచి ఈ మూవీ సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఇదే విషయంపై కేరళ థియేటర్స్ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడంపై 7,8 సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాకు కేవలం ఐదు వారాల్లోపే ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. ఓటీటీలో రిలీజ్ తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు.
కాగా. .. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Theatre owners are not only disappointed with the early release of #2018Movie but also with #PachuvumAthbuthavilakkum
— Friday Matinee (@VRFridayMatinee) June 6, 2023
#Kerala theater owners has called for a strike on June 7th & 8th as a protest against early #OTT releases of #Malayalam films. Recent industry hit #2018Movie is to be shown on #OTT in less than 5 weeks of its theatrical release! pic.twitter.com/YVvN1XGnmE
— Sreedhar Pillai (@sri50) June 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.