Adipurush: క్రాకర్స్ కోసమే రూ.50 లక్షలు.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఖర్చు ఎన్ని కోట్లంటే..
ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్.. ఈ క్రమంలోనే జూన్ 6న మంగళవారం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు లక్షకుపైగానే అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకుకు ఖర్చు చేసిన వివరాలు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి.

ఆదిపురుష్.. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న పేరు. ఎన్నో అంచనాల మధ్య జూన్ 16న విడుదలకాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఇక తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ మూవీ ఏరెంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్.. ఈ క్రమంలోనే జూన్ 6న మంగళవారం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు లక్షకుపైగానే అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకుకు ఖర్చు చేసిన వివరాలు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఈ వేడకుకు రూ. 50 లక్షల విలువైన క్రాకర్స్ ఏర్పాటు చేశారట. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో అయోధ్య సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులను ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ..సినిమా కోసం దాదాపు 8 నెలలుగా ఎవరూ నిద్రపోలేదని.. ఓంరౌత్ మాములు ఫైట్ చేయలేదని అన్నారు. అంతగా కష్టపడే దర్శకుడిని ఈ 20 ఏళ్లలో చూడలేదని అన్నారు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 16నతెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని టీసిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. మొదటిసారి ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.