Adipurush: ఆదిపురుష్‌ టీం సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఉచితంగా 10 వేల సినిమా టికెట్లు.. ఎవరికంటే?

రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్‌ సినిమాను నిర్మించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్లు మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆది పురుష్‌ సినిమాను చూద్దామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Adipurush: ఆదిపురుష్‌ టీం సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఉచితంగా 10 వేల సినిమా టికెట్లు.. ఎవరికంటే?
Adipurush Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 6:00 AM

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ త్వరలో రఘురాముడి అవతారంలో కనిపించనున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ఆది పురుష్‌ జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ కృతిసనన్‌ సీతమ్మ పాత్రలో అలరించనుంది. సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్‌ సినిమాను నిర్మించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్లు మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆది పురుష్‌ సినిమాను చూద్దామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రభాస్‌ సినిమాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. తెలంగాణలో పదివేల ఆదిపురుష్ సినిమా టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

‘ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముడిని అందరమూ స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం. టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం. ‘ అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు, సందేహాలకు 95050 34567 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అభిషేక్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.