Adipurush: ఆది పురుష్ టీమ్‌పై చర్యలు తీసుకోండి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి
తిరుమల కొండపై ఆదిపురుష్ టీమ్ చేసిన అపచారంపై వివాదం కొనసాగుతోంది. హీరోయిన్ కృతి సనన్‌ని కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నదర్శకుడు ఓం రౌత్ తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆదిపురుష్ టీమ్ చర్యలపై సనాతన ధర్మపరిరక్షణ సమితి తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తిరుమల కొండపై ఆదిపురుష్ టీమ్ చేసిన అపచారంపై వివాదం కొనసాగుతోంది. హీరోయిన్ కృతి సనన్‌ని కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నదర్శకుడు ఓం రౌత్ తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆదిపురుష్ టీమ్ చర్యలపై సనాతన ధర్మపరిరక్షణ సమితి తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆధ్యాత్మికక్షేత్రంలోఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా మండిపడ్డారు. తిరుమల లాంటి పవిత్రక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మళ్లీ పునరావృతం కాకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను డైరెక్టర్ ఓం రౌత్ ఆలింగనం చేసుకుని..ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ. టీటీడీ వీళ్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటా బైబై చెప్పడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ అది. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో సర్వ సాధారణం. కానీ, తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీసిన ఓం రౌత్ ఉద్దేశపూర్వకంగా ఆ పని చేసి ఉండకపోవచ్చని, అతని భక్తి శ్రద్థలు ఎక్కువేనని ఆయన టీమ్ చెబుతున్నారు. ఐతే తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు. గతంలో నయనతార తిరుమల మాఢవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం వివాదాస్పదంగా మారింది. సరైన చర్యలు లేకపోతే పదేపదే ఇలాగే జరుగుతాయని భక్తులు అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..