AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: రాముడికి మీసాలు .. క్లారిటీ ఇచ్చిన ఆదిపురుష్ నిర్మాత

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

Adipurush: రాముడికి మీసాలు .. క్లారిటీ ఇచ్చిన ఆదిపురుష్ నిర్మాత
Adipurush Movie
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2023 | 6:47 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రఘునందనుడి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ పై వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. మొన్నామధ్య విడుదలైన టీజర్ పై కొన్ని విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఆకట్టుకోలేక పోయింది అనే టాక్ వినిపించింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ పై కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కు మీసాలు ఉండటం పై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా దేనికి పై క్లారిటీ ఇచ్చారు సినిమా నిర్మాతలు.

రాముడికి మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు నిర్మాత విక్రమ్ స్పందిస్తూ ఆదిపురుష్ మూవీ అందరికీ నచ్చుతుందని అన్నారు. సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్థం అవుతుందని ఆయన తెలిపారు. అలాగే సినిమా చూస్తే విమర్శకులకు ఉన్న చాలా డౌట్స్ కు క్లారిటీ వస్తుందని అన్నారు విక్రమ్. ఇక ఆదిపురుష్ సినిమా జూన్ 16న భారీగా రిలీజ్ కానుంది.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్