Anasuya: విజయ్‌ దేవరకొండతో కోల్డ్‌వార్‌పై ఓపెన్‌ అయిన అనసూయ.. ఇకపై అలా చేయనంటూ..

ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు 'THE' అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ 'పైత్యం ఎక్కువైంది' అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ. దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించకపోయినా అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత మధ్యలో డైరెక్టర్‌ హరీష్ శంకర్..

Anasuya: విజయ్‌ దేవరకొండతో కోల్డ్‌వార్‌పై ఓపెన్‌ అయిన అనసూయ.. ఇకపై అలా చేయనంటూ..
Vijay Devarakonda, Anasuya
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2023 | 7:15 AM

ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కొన్ని రోజుల ముందు విజయ్‌ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు ‘THE’ అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ ‘పైత్యం ఎక్కువైంది’ అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ. దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించకపోయినా అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత మధ్యలో డైరెక్టర్‌ హరీష్ శంకర్, కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ వంటి వారు కూడా ‘THE’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట్లో పోస్టులు షేర్‌ చేయడం, వాటికి నటి రిప్లైలు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. అయితే విజయ్‌ దేవరకొండతో విభేదాలపై అనసూయ డైరెక్టుగా స్పందించలేదు. కానీ మొదటిసారిగా ఈ వ్యవహారంపై ఓపెన్‌ అయ్యిందీ స్టార్‌ యాంకర్‌. గతంలో విజయ్‌ తనకు మంచి స్నేహితుడని, కొన్ని పరిస్థితుల వల్ల తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకొచ్చింది. అలాగే ఇకపై విజయ్‌పై ట్వీట్లు చేయనని పేర్కొంది.

‘‘విజయ్‌ దేవరకొండతో నాకు ఎంతో కాలం నుంచో పరిచయం ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే మూవీ రిలీజైన సమయంలో థియేటర్‌కు వెళ్లిన విజయ్‌.. అక్కడ ఉన్న ఫ్యాన్స్‌తో ఆ పదాలను పలికించారు. ఒక మహిళగా అది నన్నెంతో బాధించింది. ఇలాంటివి ఎంకరేజ్‌ చేయవద్దని విజయ్‌తో చెప్పా. అప్పటి నుంచే నాపై ట్రోలింగ్ స్టార్ట్‌ అయ్యింది. అయినా నేను విజయ్‌ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించాను. విజయ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్‌ చేయడం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యాను. విజయ్‌కు తెలియకుండానే ఇది జరగుతోందా? అనిపించింది. విజయ్‌ నన్నుద్వేషిస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. అయితే నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి’ అని అనసూయ చెప్పుకొచ్చింది. మరి ఈ వ్యాఖ్యలపై విజయ్‌ ఫ్యాన్స్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..