Anushka Shetty: అనుష్కకు అరుదైన వ్యాధి.. షాక్ అవుతున్న అభిమానులు
పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాతో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది.
స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన భామల్లో ముందు వరసలో ఉంటారు అందాల అనుష్క. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాతో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా మారింది.. అలాగే.. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క నటన అద్భుతం. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి 2 తర్వాత వెండితెరపై కనిపించలేదు. చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న స్వీటీ.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి సరసన నటిస్తోంది.
ఈ సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనుంది. ఇక అనుష్కకు ఓ అరుదైన వ్యాధి ఉందని మీకు తెలుసా.. ? నిజం అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అది తెలిసి ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే అనుష్కకు ఉన్న వ్యాధి అంత భయంకరమైనది కాదు.
అనుష్కకు ఉన్న వ్యాధి ఏంటంటే.. ఆమె నవ్వితే ఆగకుండా దాదాపు 10 నుంచి 20నిముషాల పాటు నవ్వుతారట. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నవ్వును ఆపుకోలేరట అనుష్క. దాంతో సినిమా షూటింగ్ సమయంలో చాలా ప్రాబ్లమ్ గా ఉంటుందట. ఈ విషయం పై గతంలోనే చాలా వార్తలు వచ్చాయి కూడా.. ఇది తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.